ఫాం వీడియో షేర్‌ చేసిన నమ్రత.. | Namrata Shirodkar Shares Her Fresh Veggie Farm Video | Sakshi
Sakshi News home page

మా ఫాంలోని తాజా కూరగాయలు: నమ్రత

Published Wed, Dec 16 2020 3:17 PM | Last Updated on Wed, Dec 16 2020 6:27 PM

Namrata Shirodkar Shares Her Fresh Veggie Farm Video - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు లాక్‌డౌన్‌లో తన కూతురు సితార, గౌతమ్‌లతో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో​ పంచుకుంటునే ఉన్నారు. అలాగే ఈ ఘట్టమనేని ఫ్యామిలీ ఇటీవల ముంబై పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మహేష్‌, నమ్రతలు ముంబైలో తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి అక్కడ సందడి చేసి ఇటీవల హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో నమ్రత తాజాగా ఓ వీడియోను షేర్‌ చేశారు. హైదరాబాద్‌లోని తమ ఫాంలో పర్యటిస్తున్న వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: దటీజ్‌ మహేశ్‌.. వరుసగా మూడోసారి)

ఈ వీడియోలో నమ్రత వారి ఫాంలో పండిన బేబీ టమాట, ఎర్ర మిరపకాయలు, పత్తి(కాటన్‌), బెండకాయ తోటలను చూపిస్తూ మురిసిపోయారు. అంతేగాక కోసిన వరిపంట చూపిస్తూన్న వీడియోకు.. ‘పొలంలో పండిన వాటి కంటే తాజా కూరగాయలు ఇంకేముంటాయి. ఐ లవ్‌ ఇట్‌’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటోంది. ఫాంలో పండిన కూరగాయలను చూపిస్తూ ఆమె మురిసిపోతుంటే మహేష్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు.

‘చాలా బాగుంది మ్యామ్‌, అద్భుతం’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా మహేష్‌ బాబు తాజాగా ‘గీతా గోవిందం’ ఫేం పరశురామ్ దర్శకత్వంలో రూపోందుతున్న ‘సర్కారి వారి పాట’లో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ హైదరాబాద్‌లో షూటింగ్‌ షెడ్యూల్‌ జరుపుకుని ఆ తర్వాత ఆమెరికా వెళ్లనుంది. కాగా ఇందులో మహేష్‌ సరసన ‘మహానటి’ కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. (చదవండి: 'సర్కారు వారి' ప్లాన్‌ మారిందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement