
హీరో ప్రభాస్‌ను చులకన చేస్తూ మాట్లాడిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ పేరు గత కొద్దిరోజులుగా మారుమోగిపోతోంది. పాన్ ఇండియా స్టార్‌ను పట్టుకుని కల్కిలో తన లుక్ జోకర్‌లా ఉందని హేళన చేస్తావా? అంటూ సినీ తారలు, అభిమానులు అతడిని ఏకిపారేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన నాని.. అతడికి జీవితంలో ఇంత పబ్లిసిటీ ఎప్పుడూ వచ్చి ఉండదు. మీరు అనవసరంగా ప్రాముఖ్యత లేని విషయాన్ని పెద్దది చేసి చూపిస్తున్నారని మీడియాతో అన్నాడు.
హిందీలో రిలీజ్ చేస్తున్నారని మర్చిపోయావా?
సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్ల సమయంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ఉత్తరాది నటుడు అర్షద్.. ప్రభాస్‌ను ఏమీ అనలేదు, ఆయన లుక్‌ను మాత్రమే విమర్శించాడు. అంతదానికే ఇలా సెటైర్లు వేయాలా? అని కొందరు ఆగ్రహించారు. నీ సినిమా హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడంటూ నార్త్ ఆడియన్స్ నానికి కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో నేచురల్ స్టార్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు.
తప్పుగా అర్థం చేసుకున్నారు
కొన్నిసార్లు మనం ఇంగ్లీష్‌లో మాట్లాడినప్పుడు దాని భావాలే మారిపోతాయి. సోషల్ మీడియాలో ఇదే జరుగుతుంది. అనవసరమైన విషయాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని ఇంగ్లీష్‌లో చెప్పాను. అది జనాలకు మరోలా అర్థమైంది. నిజానికి అర్షద్ మంచి నటుడు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరూ మున్నాభాయ్ సినిమాలో అతడి పాత్రను ప్రేమించారు.
జాగ్రత్తగా ఉండాలి
అయితే మనం ఇంట్లోనో, ఫ్రెండ్స్‌తోనో ఉన్నప్పుడు సినిమాలు, యాక్టర్స్ గురించి ఎలా మాట్లాడుకున్నా పర్లేదు. కానీ బయటకు వచ్చినప్పుడు ఒక నటుడిగా పదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా అర్షద్ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment