
‘నరుడి బ్రతుకు నటన’ ట్రైలర్ చాలా బాగుంది. శివ, నితిన్ ప్రసన్న ఎంతో ఇంటెన్స్‌గా నటించారు. నా చిత్రంలో ఏదైనా మంచిపాత్రలు ఉంటే వారిని సూచించాలనుకుంటున్నాను. రిషి ఈ మూవీని అద్భుతంగా తీశాడు. పెద్ద సినిమాలే కాదు.. చిన్న చిత్రాలు, మీడియం చిత్రాలూ ఇండస్ట్రీని నడిపిస్తాయి. ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయాలి’’ అని హీరో సుధీర్ బాబు అన్నారు.
శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీ జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతరపాత్రలు ΄ోషించారు. టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డా. సింధు రెడ్డి నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సుధీర్‌బాబు, దర్శకులు వీరశంకర్, శ్రీరామ్ ఆదిత్య, నటీనటులు వితికా శేరు, వీజే సన్నీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ వేడుకలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమాపై ఫ్యాషన్, డబ్బులుంటే సినిమాలు తీయలేం. నేను ప్రారంభంలో కొన్ని చిత్రాలను నిర్మించాను. కానీ, థియేటర్‌లో విడుదల చేయలేకపోయాను. ‘నరుడి బ్రతుకు నటన’ టీమ్‌ని చూసినప్పుడు నాకుపాత రోజులు గుర్తుకొచ్చాయి. అందుకే వారికి హెల్ప్ చేయాలని ముందుకు వచ్చాను’’ అని తెలిపారు. ‘‘యూనివర్సల్ సబ్జెక్టుతో రూపొందిన చిత్రమిది’’ అన్నారు రిషికేశ్వర్ యోగి, సింధు రెడ్డి, శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న.
Comments
Please login to add a commentAdd a comment