
ఉదయ్‌కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన సినిమా నీ స్నేహం. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను పరుచూరి మురళి దర్శకత్వం వహించిగా, కళాతపస్వి కె. విశ్వనాథ్ కీలక పాత్రలో నటించారు. 2002లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తారు విజయం సాధించింది. ముఖ్యంగా ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది.
ఈ మూవీలోని పాటలన్నిటినీ సిరివెన్నెల రాయడం విశేషం. స్నేహితులిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత నిజం తెలిసి ఫ్రెండ్ కోసం ప్రేమను త్యాగం చేయడం సినిమా కథాంశం. ఈ చిత్రంలో హీరోగా ఉదయ్‌కిరణ్ నటించగా, అతని ఫ్రెండ్ క్యారెక్టర్‌లో బాలీవుడ్ నటుడు జతిన్ అలరించాడు.
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన జతిన్ హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించాడు. తెలుగులో నీ స్నేహం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. 2010లో కరోలినా గ్రేవాల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న జతిన్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
Comments
Please login to add a commentAdd a comment