Thalaivar 169: Nelson Dilipkumar to Dropped From Rajinikanth 169 Movie? News Viral - Sakshi
Sakshi News home page

Rajinikanth 169: ‘బీస్ట్‌’ ఎఫెక్ట్‌.. రజనీకాంత్‌తో సినిమా క్యాన్సిల్‌!

Published Thu, Apr 21 2022 4:46 PM | Last Updated on Thu, Apr 21 2022 6:31 PM

Nelson Dilipkumar To Dropped From Rajinikanth 169 Movie, News Goes Viral - Sakshi

నెల్సన్ దిలీప్ కుమార్.. ‘బీస్ట్‌’ విడుదలకు ముందు అతను ఓ స్టార్‌ డైరెక్టర్‌. యంగ్‌ టాలెంట్‌కు ప్రతిరూపం. అతని మేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిశాయి. కానీ ‘బీస్ట్‌’ విడుదల తర్వాత పొగిడిన నోళ్లే తిడుతున్నాయి. అతను స్టార్‌ హీరోలతో సినిమాలు చేయడానికి పనికిరాడని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా విజయ్‌ ఫ్యాన్స్‌ అయితే నెల్సన్‌పై గుర్రుగా ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న తమ హీరోకు బీస్ట్ లాంటి ప్లాప్‌ అందించాడని ఫైర్‌ అవుతున్నారు. కోలమావు కోకిల, వరుణ్ డాక్టర్ లాంటి చిత్రాలను అంతబాగా తీసి బీస్ట్ ను మాత్రం వరస్ట్ గా తీసాడని స్వయంగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
(చదవండి: ఒకప్పుడు స్టార్‌ డైరెక్టర్‌.. ఇప్పుడు ఏ హీరో డేట్స్‌ ఇవ్వడం లేదు!)

ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడిన కారణంగా  రజనీకాంత్ తో చేయాల్సిన నెల్సన్‌ సినిమాకు బ్రేక్ పడిందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీస్ట్ రిలీజ్ కు ముందుకే రజనీకాంత్ నెలన్స్ ను పిలిచి తన కొత్త చిత్రం దర్శకత్వం వహించాల్సిందిగా కోరాడు. బీస్ట్ నిర్మించిన సన్ పిక్చర్స్ వెంటనే వీరి కాంబినేషన్ లో సినిమా కూడా ఎనౌన్స్ చేసింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.

అసలే కోలీవుడ్ కు బ్లాక్ బస్టర్ బాకీ పడ్డాడు తలైవా.ఈ సమయంలో బీస్ట్ డైరెక్టర్ తో సినిమా అంటే.. ఆయన అభిమానులే భయపడుతున్నారు. మరోవైపు రజనీకాంత్ సన్నిహితులు మాత్రం నెల్సన్ దర్శకత్వంలో సూపర్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. ఇంత నెగిటివిటీని, ఇంత ప్రెజర్ ను తట్టుకుని నెల్సన్ సూపర్ స్టార్ తో సినిమాను ఎలా తెరకెక్కిస్తాడు అనేది ఇఫ్పుడు హాట్ టాపిక్ మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement