
జబర్దస్త్ హోస్టింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. యాంకర్‌గానే కాకుండా యాక్టింగ్‌తోనూ ప్రేక్షకులను అలరిస్తోన్న అనసూయ ఇటీవల 'పుష్ప: ద రైజ్' సినిమాలో దాక్షాయణిగా కనిపించి ఆకట్టుకుంది. ఇక షొటోషూట్లతో సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఆమె తన భర్త సుశాంక్ భరద్వాజ్ ఓ గిఫ్ట్ ఇచ్చాడోచ్ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె తన చేతి గడియారం కనిపించేలా ఫొటోలకు పోజులిచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు మేకప్ లేకున్నా కూడా ఎంత బాగున్నావో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఓ నెటిజన్ మాత్రం 'ఏంటి? సెల్ఫీ అడిగితే ఫోన్ పగలగొట్టావని విన్నాను..నిజమేనా?' అంటూ ప్రశ్నించాడు. దీనికి అనసూయ స్పందిస్తూ 'ఎవరు సార్ మీకు చెప్పింది?' అని తిరిగి ప్రశ్నించింది. దీనికి సదరు నెటిజన్ సమాధానమిస్తూ.. 'దానికి సంబంధించిన వీడియో మీకు పంపుతాను మేడమ్. అందులో మీ కారు నంబర్ కూడా ఉంది. ఒకవేళ ఇది ఫేక్ వీడియో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇది పాత వీడియోనో లేదా ఈ మధ్యే జరిగిందో అర్థం కావడం లేదు' అని బదులిచ్చాడు.
దీనికి యాంకర్ స్పందిస్తూ.. 'సరే గానీ, మీకు నాదో విన్నపం.. దయచేసి యూట్యూబ్‌లో వచ్చేవాటిని నమ్మకండి. బతకడం కోసం వాళ్లు ఏదైనా చేస్తారు. ఇలాంటివి చూసినప్పుడే మానవత్వం చచ్చిపోతుందనిపిస్తుంది. దయచేసి ఒకరి పట్ల ఒకరం బాధ్యతగా ఉందాం. నా గురించి ఇంతలా ఆలోచించినందుకు ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. ఇక దీని గురించి ఇతర నెటిజన్లు మాట్లాడుతూ.. అతడు పాత వీడియో గురించి ప్రస్తావించాడని, గతంలోనే అనసూయ దాని గురించి క్లారిటీ ఇచ్చాక కూడా మళ్లీ దాన్ని తవ్వడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment