
హీరో సిద్ధార్థ్‌కు మరోసారి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఉద్దేశపూర్వకంగానే తనని ఎవరో టార్గెట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారంటూ సిద్ధార్థ్ స్పందించాడు. కాగా ఇటీవల యుక్త వయసులో మరణించిన నటీనటులు వీల్లే అంటూ హీరోయిన్స్ సౌందర్య, ఆర్తి అగర్వాల్ ఫొటోలతో పాటు హీరో సిద్దార్థ్ ఫొటోను చేర్చి ఫేక్ వీడియో వదిలిన సంగతి తెలిసిందే. దీనిపై అతడు స్పందిస్తూ నెటిజన్లను హెచ్చరించాడు. అయినా సిద్ధార్థ్‌పై తప్పడు ప్రచారం ఆగడం లేదు.
చదవండి: శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు
నిన్న(సెప్టెంబర్ 2) బాలీవుడ్ టీవీ నటుడు, బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయసులోనే గుండెపోటుతో సిద్ధార్థ్ మృతి చెందడంతో భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దీంతో అతడి మృతికి విచారం వ్యక్తం చేస్తూ నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రముఖుల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఈ క్రమంలో కొందరూ ఆకతాయిలు సిద్ధార్థ్ శుక్లా ఫొటో బదులుగా సౌత్ హీరో సిద్ధార్థ్ ఫొటోను షేర్ చేస్తూ ‘రిప్ సిద్దార్థ్’ అని జత చేశారు. ట్విటర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ సిద్దార్థ్ దృష్టికి వెళ్లడంతో అతడు నెటిజన్లపై అసహనం వ్యక్తం చేశాడు.
చదవండి: సిద్ధార్థ్ శుక్లా చివరి క్షణాలు ఇవేనంటూ వీడియో వైరల్.. నిజం ఏంటంటే?
ఈ ట్వీట్‌ను తిరిగి షేర్ చేస్తూ.. ‘కావాలనే కొందరూ నన్ను ఇలా వేధిస్తూ, ద్వేషిస్తన్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా గతంలో తనకు హత్య, అత్యాచారం బెదరింపుల వస్తున్నాయంటూ సిద్ధార్థ్ ఇప్పటికే పలుమార్లు తన బాధని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలం బతికున్న సెలబ్రెటీలను సోషల్ మీడియాలో చంపేస్తూ పోస్టులు వైరల్ చేస్తున్నారు కొందరూ నెటిజన్లు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు, సింగర్ చనిపోయారంటూ పోస్టులు దర్శమివ్వడంతో వారు స్పందిస్తూ తాము బతికే ఉన్నామని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేస్తున్నప్పటికి ఇలాంటి ఫేక్ న్యూస్‌లు మాత్రం ఆగడం లేదు.
Targetted hate and harassment. What have we been reduced to? pic.twitter.com/61rgN88khF
— Siddharth (@Actor_Siddharth) September 2, 2021
Comments
Please login to add a commentAdd a comment