
బాలీవుడ్‌లోని బ్యూటిఫుల్ కపుల్స్ లిస్టులో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్ జంట అగ్రస్థానంలో ఉంటుంది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపించడం లేదు. చాలా కార్యక్రమాలకు, పార్టీలకు ఐశ్వర్య ఒంటరిగానో లేదంటే కూతురిని తీసుకునో వెళుతోంది. కానీ భర్త అభిషేక్‌తో మాత్రం కనిపించడం లేదు. ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచ్ ఈవెంట్‌కు కూడా ఐశ్వర్య తన గారాలపట్టి ఆరాధ్యతో కలిసి వెళ్లింది. వీరి వెంట అభిషేక్ మాత్రం వెళ్లలేదు.
కేవలం ఈ ఒక్క ప్రోగ్రామ్ అనే కాదు చాలా సందర్భాల్లో ఐశ్వర్య వెంట అభిషేక్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వీరిద్దరి మధ్య ఏవో గొడవలు జరిగి ఉండొచ్చని నెటిజన్లు సందేహిస్తున్నారు. వీరు విడాకులు తీసుకోబోతున్నారేమోనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వీరు విడిపోతున్నారంటూ వార్తలు రావడం ఇదేం కొత్తేమీ కాదు.
2014లోనూ వీరిద్దరి బంధం చెడింది, విడాకులు తథ్యం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అభిషేక్ స్పందిస్తూ.. ఓకే, నేను విడాకులు తీసుకుంటున్నానని నమ్ముతున్నాను. ఈ విషయం నాకు గుర్తుచేసినందుకు థ్యాంక్స్. పనిలో పనిగా నా రెండో పెళ్లి ఎప్పుడో కూడా మీరే చెప్పండి అని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చి రూమర్స్‌కు చెక్ పెట్టాడు. కాగా ఐశ్వర్య, అభిషేక్ 2007 ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది.
Comments
Please login to add a commentAdd a comment