
మెగా ఫ్యామిలీలో పెళ్లిబాజా కౌంట్‌డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో నటి, నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి కుమార్తెగా ముస్తాబు కానుంది. దీంతో నిహారిక, చైతన్యలు తమఫ్రెండ్స్‌తో కలిసి ఉదయ్‌పూర్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరిగిన విషయం విదితమే.
ప్రముఖ బిజినెస్‌మ్యాన్ చైతన్యతో నిహారిక వివాహం డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ప్రముఖ ప్యాలెస్‌లో జరగనుంది. ఇప్పటికే పెళ్లిక సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువుల మధ్య వివాహ వేడుక జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌లోవీరి రిపెప్షన్ జరగనుంది. ఫ్రీ వెడ్డింగ్ షూట్ నేపథ్యంలో ఇప్పటికే చైతన్య- నిహారిక జంట ఉదయ్‌పూర్ చేరుకున్నారు. (నిహారిక పెళ్లి పనులు షురూ )
Comments
Please login to add a commentAdd a comment