
జీవితంలో మనకు చాలా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ ఎన్ని దెబ్బలు తగిలినా ఏమాత్రం చింతించకుండా ధైర్యంతో ముందడుగు వేయడమే ముఖ్యం.
హృదయాలను హత్తుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందరి మనసులను మెలిపెట్టేందుకు సాగు అనే షార్ట్ ఫిలిం రాబోతోంది. రిలీజ్‌కు ముందే ఈ షార్ట్ ఫిలిం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది. మార్చి 4 నుంచి సాగు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. వినయ్ రత్నం దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింలో వంశీ తుమ్మల, హారిక ప్రధాన పాత్రల్లో నటించారు. యశస్వి నిర్మించాడు.
ఎదురుదెబ్బలు..
తాజాగా సాగు ప్రెస్‌మీట్‌లో నిహారిక కొణిదెల ఎమోషనల్ అయింది. సాగు నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం. నేను కూడా మీలాగే ఒక స్క్రీనింగ్‌కు అతిథిగా పిలిస్తే వెళ్లాను. అందులో నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఒకటుంది. జీవితంలో మనకు చాలా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ ఎన్ని దెబ్బలు తగిలినా ఏమాత్రం చింతించకుండా ధైర్యంతో ముందడుగు వేయడమే ముఖ్యం.
నా కుటుంబం, స్నేహితుల వల్లే..
నేను అంతలా కనెక్ట్ అవ్వడానికి మరో కారణం కూడా ఉంది. మనదగ్గర రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయి. సాగులో చెప్పిన ఓ అంశంతోపాటు ఇంకా అనేక కారణాలతో వారు చనిపోతూ ఉంటారు. ఏమైనా పర్లేదు, మేము చూసుకుంటాం అనే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మనకుంటే జీవితంలో ఏదైనా చేసేయొచ్చు. నేను బాధలో ఉన్న ప్రతిసారి నా కుటుంబసభ్యులు, స్నేహితులు నాకు అండగా నిలబడి ముందుకు వెళ్లడానికి సాయం చేశారు అని చెప్పుకొచ్చింది.
చదవండి: ఐఏఎస్ కోసం ప్రయత్నాలు.. ఎన్నోసార్లు ఫెయిలైన నటి.. చిట్టచివరకు!