అఫిషియల్‌: బోయపాటి-రామ్‌ కాంబోలో పాన్‌ ఇండియా చిత్రం | Official: Ram Pothineni And Boyapati Srinu Tie Up For Pan India Movie | Sakshi
Sakshi News home page

Ram Pothineni-Boyapati: ఆఫిషియల్‌, పాన్‌ ఇండియా చిత్రంగా బోయపాటి-రామ్‌ మూవీ

Published Fri, Feb 18 2022 9:42 PM | Last Updated on Fri, Feb 18 2022 9:49 PM

Official: Ram Pothineni And Boyapati Srinu Tie Up For Pan India Movie - Sakshi

మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను-యంగ్‌ హీరో రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ సినిమాలో నటీనటులు వీరే అంటూ కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సినిమా ప్రకటన ఇంకా రాలేదు.. కానీ అప్పుడే నటీనటుల పాత్రలు,పేర్లు వినిపించడమేంటని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో​ తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇచ్చాడు బోయపాటి.

చదవండి: తప్పతాగి అర్థరాత్రి రోడ్డుపై హల్‌చల్‌.. హీరోయిన్‌ అరెస్ట్‌ 

దర్శకుడిగా బోయపాటికి ఇది 10వ సినిమా కాగా.. రామ్‌కు ఇది 20వ సినిమా. ప్రస్తుతం రామ్.. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బోయపాటి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు పెట్టనున్నాడట. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమాలో రామ్‌కు అక్కగా సీనియర్‌ హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

చదవండి: భీమ్లా నాయక్‌ నిర్మాత నోటి దురద.. ఆపై సారీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement