సాక్షి, తాడేపల్లి: సినీ పరిశ్రమ పెద్దలు ఈ నెల 10న (గురువారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ కానున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చాలా మంది ప్రముఖులు కలవాలని అనుకున్నారని.. కోవిడ్ కారణంగా తక్కువ మందితో భేటీ జరగనున్నట్లు చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్‌తో చర్చించనున్నారని.. సినిమా టికెట్ల రేట్లు ఫైనల్ కాలేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
AP: ఉపాధ్యాయ సంఘాల బండారం బయటపెట్టిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ
సీఎం వైఎస్ జగన్‌తో మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. రేపు టాలీవుడ్‌కు చెందిన సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అక్కినేనితో పాటు పలువురు ప్రముఖు సీఎం జగన్‌ను కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పేర్ని నాని సీఎం జగన్‌ను కలిసి కమిటీ నిర్ణయాలను వివరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment