
ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ విశ్లేషకుడు ఫణి రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. ఈ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన అతడు సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడిని వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అయితే అతడికి వైద్యం అందించడానికి రోజుకు లక్షన్నర పైనే ఖర్చవుతోందని, దాతలు తోచిన సాయం చేసి ఆదుకోవాలని అతడి కుటుంబం కోరుతోంది.
కాగా ఫణి చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'ప్రాణం లేకపోవడమే కాదు, బతుకు మీద ఆశ లేకపోవడం కూడా చావే' అని సదరు పోస్ట్‌లో తన భావాలను రాసుకొచ్చాడు ఫణి. ఇతడు బిగ్‌బాస్ షోను ఫాలో అవుతూ తన అభిప్రాయాన్ని రివ్యూల ద్వారా చెప్పేవాడు. ఈ రివ్యూలతో అతడు యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యాడు. గత బిగ్‌బాస్ సీజన్‌లకే కాకుండా ప్రస్తుతం ఓటీటీలో వస్తున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌కు కూడా రివ్యూలు ఇస్తున్నాడు ఫణి.
చదవండి: రోడ్డు ప్రమాదంలో నటి మృతి.. ప్రమాదానికి కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment