
సాక్షి, హైదరాబాద్: మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య అర్ధరాత్రిపూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్‌మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం అర్ధరాత్రి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో గొడవ జరిగింది. దీంతో కంగారుపడ్డ అపార్ట్‌మెంట్ వాసులు వారింటికి వెళ్లగా చైతన్య వారి మీద కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడంటూ అపార్ట్‌మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అపార్ట్‌మెంట్ వాసులపై చైతన్య కూడా తిరిగి ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్‌మెంట్ వాసులు భంగం కలిగిస్తున్నారని ఆరోపించాడు. దీంతో ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. కాగా మెగా డాటర్ నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల వివాహం డిసెంబర్ 9న జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment