
తమిళ కొత్త సినిమా పూజను పూజా హెగ్డే మిస్సయ్యారు. విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం చెన్నైలో జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమె పూజా కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారు. ‘‘విజయ్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొనలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. నేను మరొక లొకేషన్‌లో షూటింగ్‌తో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. కానీ నా మనసు ఇప్పుడు ఈ చిత్రయూనిట్‌తోనే ఉంది. ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పూజా హెగ్డే పేర్కొన్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. విజయ్, పూజాలపై తొలుత ఓ పాటను చిత్రీకరించేందకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉంటే.. తెలుగులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ‘రాధే శ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో పూజా హెగ్డే ఓ కీ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలు కాకుండా హిందీలో సల్మాన్‌తో ‘కబీ ఈద్ కబీ దీవాళి’, రణ్‌వీర్ సింగ్‌తో ‘సర్కస్’ సినిమాలు చేస్తున్నారు పూజా హెగ్డే.
చదవండి:
బాలీవుడ్ మరో చిత్రానికి ‘గుడ్ బై’ చెప్పిన రష్మిక!
Comments
Please login to add a commentAdd a comment