Pooja Hegde Reveals About Message And Calls From Chiranjeevi, Thalapathy Vijay - Sakshi
Sakshi News home page

Pooja Hegde: మెగాస్టార్‌ మెస్సేజ్‌ చేశారు.. విజయ్‌ ఎంతో స్వీట్‌: పూజా హెగ్డే

Published Mon, Oct 18 2021 3:53 PM | Last Updated on Mon, Oct 18 2021 6:10 PM

Pooja Hegde Reveals About Message From Chiranjeevi And Calls Thalapathy Vijay As Sweetest - Sakshi

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ సైతం మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్‌ పూజా హెగ్డే. టాప్‌ స్టార్స్‌ వరుస సినిమాలు చేస్తూ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తాజాగా అఖిల్‌ అక్కినేని సరసన కథానాయికగా ఆమె నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ విజయాపథంలో దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యూటీ ట్విట్టర్‌లో #AskPooja అనే సరదా సెషన్‌ను నిర్వహించింది. అందులో అభిమానులు అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.


మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పామని ఆమె అభిమానులలో ఒకరు కోరగా.. ‘చిరంజీవిగారు నాకు మేస్సేజ్‌ చేశారు. అందులో నా కొత్త చిత్రంలో నా ఫర్‌ఫామెన్స్‌ని మెచ్చుకున్నారు. దీంతో ఇంకా హార్డ్‌ వర్క్‌ చేయాలనే ప్రేరణ కలిగింది’ అని ఈ భామ తెలిపింది. మరొకరు తమిళ  స్టార్‌ దళపతి గురించి ఒక్క మాటలో చెప్పని అడగగా.. ఆయన ఎంతో స్వీట్‌ అని ఈ కుర్ర హీరోయిన్‌ చెప్పింది. అంతేకాకుండా ఈ సెషన్‌లో ప్రభాస్‌ సరసన తను చేస్తున్న ‘రాధేశ్యామ్‌’, ఫుడ్‌, మ్యూజిక్‌ వంటి వివిధ అంశాలపై ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇచ్చింది.

అయితే పూజా ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌కి జోడిగా క్యామియో రోల్‌, విజయ్‌ సరసన ఆయన కొత్త చిత్రం ‘బీస్ట్‌’లో నటిస్తోంది. మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement