Pooja Hegde Recovering From Ankle Injury - Sakshi
Sakshi News home page

Pooja Hegde: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే

Published Tue, Nov 8 2022 9:38 AM | Last Updated on Tue, Nov 8 2022 11:31 AM

Pooja Hegde Said She Recovering From Her Leg Injury Shares Post - Sakshi

సాక్షి, చెన్నై: సినీ హీరోయిన్లకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోందా? అని అనిపిస్తోంది. తమ అందచందాలు, అభినయంతో చిత్రాలకు ప క్క బలంగా నిలుస్తూ ప్రేక్షకులను, ము ఖ్యంగా యువతను ఎంటర్‌ టెయిన్‌ చే యడంలో కథానాయికలది ప్రధాన భూమిక అని చెప్పవచ్చు.

అలాంటి హీరోయిన్లు కొందరు ఇటీవల ప్రమాదాలకో, అనారోగ్యానికో గురవుతున్నారు. ఇటీవల నటి రంభ అమెరికాలో కారు ప్రమాదానికి గురై త్రుటిలో ప్రాణా పాయం నుంచి బయటపడిన విష యం తెలిసిందే. కాగా నటి పూజా హెగ్డే కూడా ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాలుకు బలమైన గాయమైంది. ఇక నటి త్రిష కూడా విదేశాల్లో  ఇలాంటి ప్రమాదానికి గురైంది.

చదవండి: విశ్వక్‌ సేన్‌, అర్జున్‌ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ

కాగా మరో అగ్ర నటి సమంత ఇటీవల మయోసైట్స్‌ అనే వింత వ్యాధికి గురైంది. ఈ అందాల తారలు త్వరగా కోలుకోవాలని వారి అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. నటి సమంత ఇప్పటికీ ఆ వ్యాధితో పోరాడుతోంది. త్రిష ఆస్పత్రిలో వైద్య చికిత్సలు పొందుతోంది. అలాగే మరో క్రేజీ నటి పూజా హెగ్డే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అని ఆమె తన ఇన్‌  స్ట్రాగామ్‌లో పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. లక్కీగా ఈమె నటిస్తున్న తెలుగు చిత్రాలేమీ ప్రస్తుతం షూటింగ్‌ దశలో లేవు. త్వర లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబుతో జతకట్టనున్న చిత్రం సెట్‌ పైకి వెళ్లనుంది. అప్పటికి ఈ అమ్మడు పూర్తిగా కోలుకుంటుందని భావిద్దాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement