Image Source:Twitter
కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు ప్రభాస్. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ.. తెలుగు పరిశ్రమ గుర్తింపుని, బాక్సాఫీస్ రూపురేఖలను మార్చేశాడు. 20 ఏళ్లుగా సినిమాల కోసం చాలా కష్టపడుతూ.. తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ, రెబెల్ స్టార్ నుంచి పాన్ ఇండియన్ స్టార్ స్థాయిని ఎదిగాడు. అసలు ప్రభాస్ లేకపోతే బాహుబలి చిత్రమే లేదు అని దర్శధీరుడు రాజమౌళి స్వయంగా అన్నారంటే అతని డెడికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ చిత్రం కోసం టాలీవుడ్ బాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఆయనపై నమ్మకంతో రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు.
(చదవండి: డార్లింగ్ వెనుక ఇంత సీక్రెట్ ఉందా?)
Image Source:Twitter
నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'ఆదిపురుష్'. వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణన కి తగ్గట్టుగా ఉండే ఆహార్యం సహజంగానే ఉన్న ప్రభాస్ ఇందులో రాఘవ రాముడిగా కనిపించనుండగా పూర్తి 3డి టెక్నాలజీ తో 250 కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం కనిపించనుంది.
Image Source:Twitter
అలాగే కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ హీరోగా డార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీ ని వాడుతూ తెరకెక్కుతున్న ఇండియాలో మొట్ట మొదటి భారీ చిత్రం 'సలార్'. ఇందులోని యాక్షన్, విజువల్స్ ఇదివరకెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయని చిత్రంలో నటించిన నటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు చెప్పడం విశేషం.
Image Source:Twitter
వైజయంతి మూవీస్ లాంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలో దాదాపూ 500 కోట్ల బడ్జెట్ తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె' పై విపరీతమైన అంచనాలున్నాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లాంటి పాన్ ఇండియన్ నటులు ఇందులో భాగమవుతుండగా, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ తోడవ్వడం తో ఈ చిత్రానికి ప్రపంచ దేశాల్లో భారీ మార్కెట్ దక్కనుంది. ఇది కాక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తోనూ దర్శకుడు మారుతి తో కూడా భారీ చిత్రాలు త్వరలో మొదలవ్వనున్నాయి.
20 ఏళ్ళ పాటు ప్రేక్షకుల హృదయాల్లో మకుటం లేని మహారాజులా ఎదుగుతూ, దేశంలోనే అత్యధిక పారితోషికం(రూ.120 కోట్లు) తీసుకునే స్థాయికి వచ్చినా కూడా ఏ మాత్రం గర్వం లేకుండా తన సహ నటులతో మిగతా బృందంతో ఆప్యాయంగా 'డార్లింగ్' అని పిలుస్తూ పిలిపించుకుంటూ ఉంటారు ప్రభాస్. తన కేరిర్ లో ఎలాంటి కాంట్రవర్సీ జోలికి పోకుండా తనతో పని చేసిన దిగ్గజ నిర్మాతలు, దర్శకులు మళ్ళీ మళ్ళీ తనతో పని చేయాలనిపిస్తుంది అని చెప్తున్నారంటే నటుడిగా తన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది. (అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment