
సాక్షి, రామగిరి(మంథని): సింగరేణి సంస్థ ఆర్జీ– 3 పరిధి ఓసీపీ–2లో సలార్ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. శనివారం క్వారీలోని ఖాళీ ప్రదేశంలో వేసిన సెట్టింగ్‌లో హీరో ప్రభాస్, హీరోయిన్ శృతిహాసన్‌ల మధ్య ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరించారు. దాదాపు ఉదయం 11గంటలకు ప్రారంభమైన షూటింగ్ సాయంత్రం 4గంటల వరకు సాగింది. ఆర్జీ–3 జీఎం కె.సూర్యనారాయణ, ఏపీఏ జీఎం ఎన్‌వీకే. శ్రీనివాస్, ఎస్‌ఓటూ జీఎం ఎల్వీ.సూర్యనారాయణ, ఏపీఏ ప్రాజెక్ట్ అధికారి నాగేశ్వర్‌రావులు షూటింగ్ ప్రదేశాన్ని సందర్శించారు. హీరో ప్రభాస్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
షూటింగ్ ప్రదేశం వద్ద తయారు చేస్తున్న డమ్మీ ఆయుధాలు
ప్రాణాలను పణంగా పెట్టిన అభిమానం..
ఓసీపీ–2 క్వారీలో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలు సుకున్న అభిమానులు ప్రాణాలను పణంగా పెట్టి సుమారు 20పీట్ల ఎత్తులో ఉన్న పెద్దపెద్ద బెంచీలను కాలినడకన దిగుతూ క్వారీలోకి ప్రవేశించారు. ప్రభాస్‌ను చూసేందుకు వస్తున్న అభిమానులను పోలీçసులు, ఎస్‌అండ్‌పీసీ సెక్యూరిటీ సిబ్బంది పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకపోవడంతో, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బెంచీలను కాలినడకన క్వారీలోకి దిగారు. గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని తిరిగి వాహనాల్లో పైకి తరలించారు. షూటింగ్ ప్రదేశంలో రామగిరి ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Prabhas in my hometown #SalaarSagaBegins #SAALAR #Salar pic.twitter.com/rJ3AhxHTv0
— SCOFIELD (@PramsShiva) January 29, 2021
Comments
Please login to add a commentAdd a comment