ప్రజక్త కోలి.. గురించి తెలియని యూట్యూబ్ వ్యూయర్స్ ఉండరు. ఆమె.. దేశంలోనే ఫస్ట్ ఫిమేల్ కామెడీ క్రియేటర్. వెబ్‌సిరీస్ నటీమణుల పరిచయ కాలంలో యూట్యూబర్ ఇంట్రడక్షన్ ఏంటీ? అనుకోవద్దు. నెట్‌ఫ్లిక్స్ ‘మిస్‌మ్యాచ్డ్’ తో ప్రజక్తా ఇప్పుడు వెబ్‌స్క్రీన్ మీదా ఎంట్రీ ఇచ్చింది.
- పుట్టిపెరిగింది ముంబైలో. మనోజ్ కోలి, అర్చన కోలి .. ఆమె తల్లిదండ్రులు. ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
- డిగ్రీ పూర్తవగానే రేడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టింది. ఆర్‌జేగా ఆమె చేసిన హృతిక్ రోషన్ ఇంటర్వ్యూ చాలా పాపులర్ అయింది. అదివిన్న ‘వన్ డిజిటల్’ యూట్యూబర్ సుదీప్ ఆమెను యూట్యూబ్ చానెల్ పెట్టమని ప్రోత్సహించాడు.
- అలా 2015లో ‘మోస్ట్‌లీ సేన్’ను లాంచ్ చేసింది. ‘10 హిలేరియస్ వర్డ్స్ దట్ డిల్లీ పీపుల్ యూజ్’ అనే వీడియోతో ఆ చానెల్ క్లిక్ అయింది.
- యూట్యూబ్ చానెల్స్ తొలినాళ్లలోనే వన్ మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌తో ప్రజక్త.. దేశంలోనే ఫస్ట్ ఫిమేల్ కామెడీ క్రియేటర్ అనే క్రెడిట్‌ను సాధించింది.
- సమకాలీన పరిస్థితులు, ఒరవడుల మీద ఆమె చేసే కామెడీ వీడియోలు దేశీ ప్రేక్షకులనే కాదు విదేశీ వీక్షకులనూ కడుపుబ్బ నవ్విస్తాయి. ఆ ప్రతిభ యునైటెడ్ నేషన్స్ చెవినా పడింది. ఆ హాస్యచతురతను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రజక్త వీడియోలను యూఎన్ స్క్రీన్ చేసింది.
- ఇటీవలే యూట్యూబ్ ‘గ్లోబల్ ఇనిషీయేటివ్ క్రియేటర్స్ ఫర్ చేంజ్’కి ఇండియన్ అంబాసిడర్‌గా ఎన్నికైంది కూడా.
- ఆమె హావభావాలు, చక్కటి టైమింగ్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో ఉన్న డిమాండ్ ప్రజక్తకు చలనచిత్ర, వెబ్‌పరిశ్రమలో అవకాశాలను కల్పించాయి. ముందుగా తన నటనా నైపుణ్యాన్ని ‘ఖయాలీ పులావ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో పరీక్షించుకుంది. సూపర్ హిట్ అయింది.
- ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ‘మిస్‌మ్యాచ్డ్’లో లీడ్ రోల్‌లో నటించి మెప్పించింది.. శభాష్ అనే కితాబూ పొందింది.
Comments
Please login to add a commentAdd a comment