హనుమాన్ సినిమా తర్వాత టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ప్రశాంత్‌వర్మ తర్వాతి ప్రాజెక్ట్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సుమారు 20 కథలు రెడీగా ఉన్నాయని ఆయన ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలో తన (పీవీసీయూ) నుంచి ప్రతి ఏడాది ఒక సినిమా వస్తుందని ఆయన వెళ్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పీవీసీయూలో రానున్న సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు.
ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మూడో చిత్రంగా 'మహాకాళీ' తెరకెక్కుతున్నట్లు వారు వెళ్లడించారు. టైటిల్ వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు. చెడును అంతం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుందన్నారు. (పీవీసీయూ) సూపర్ హీరోలను ఈ చిత్రంలో చూపిస్తామన్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను పూజా కొల్లురు దర్శకురాలిగా తెరకెక్కించనున్నట్లు ప్రశాంత్‌వర్మ వెల్లడించారు. అయితే, ఈ సినిమాలో నటించనున్న నటీనటులు ఎవరనేది త్వరలో చెప్పనున్నారు.
ఈ ఏడాదిలో హనుమాన్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా జై హనుమాన్ రానుంది. అయితే, ఈ చిత్రానికంటే ముందే అధీర, మహాకాళీ రానున్నాయని ప్రశాంత్ వర్మ తెలిపారు. అయితే, ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్‌గా నందమూరి మోక్షజ్ఞ సినిమా రానుంది. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రశాంత్ వర్మే దర్శకత్వం వహించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment