
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ వెళ్లి, అక్కడ జోరుగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ప్రియాంకా చోప్రా. ఆమె నటించిన తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిన నేను హాలీవుడ్‌లో కొత్త నటిలా కెరీర్ ఆరంభించినప్పుడు ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆడిషన్స్ ఇవ్వడం తప్పని అనడంలేదు. ఎందుకంటే ఆడిషన్స్ అనేవి మన ప్రతిభ మీద ఆధారపడి ఉంటాయి. ఇండస్ట్రీలో ఉన్న కనెక్షన్స్‌తో కాదు. ఆడిషన్స్‌లో గెలిచి, చాన్స్ తెచ్చుకోవడం అప్పట్లో న్యూ కమర్‌గా హాలీవుడ్‌లో నాకో మంచి అనుభూతి.
అయితే ఇప్పుడు ‘సిటాడెల్’కి ఆడిషన్స్ ఇవ్వ కుండానే సెలక్ట్ అయ్యాను. అంతగా నా ప్రతిభని నిరూపించుకున్నాను. ఇప్పుడు పోస్టర్స్‌లో నాకూ సమభాగం దక్కుతోంది. అలాగే, మేల్ స్టార్స్‌కి ఈక్వల్‌గా పారితోషికం తీసుకుంటున్నా. హాలీవుడ్‌కి వెళ్లిన పదేళ్లకు నేను సాధించుకున్న ఘనత ఇది’’ అన్నారు. ఇంకా భారతీయ తారల గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండియన్ స్టార్స్ ఉంటున్నారు. తెర పైనే కాదు.. తెరవెనక కూడా ప్రతిభను చాటుకుంటున్నారు. వాళ్లందరూ హాలీవుడ్‌కి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనవాళ్లకి అంత ప్రతిభ ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment