
కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను వెంటాడుతూ ఇండస్ట్రీని అల్లాడిస్తోంది. ఇప్పటికే పలువురు తారలు వైరస్ బారిన పడగా తాజాగా మరో హీరోయిన్‌కు కరోనా సోకింది. బ్యూటీ ప్రియాంక జవాల్కర్ తనకు కరోనా సోకినట్లు వెల్లడించింది. 'ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నాను.
ఈ మధ్యకాలంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్ష చేయించుకోండి. అందరూ మాస్కులు ధరించండి. అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయట తిరగకండి. జాగ్రత్తగా ఉండండి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కాగా టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక జవాల్కర్ తాజాగా ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’, ‘తిమ్మరుసు’, 'గమనం' చిత్రాలతో అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment