![Is Puri Jagannadh Daughter Pavithra Puri Ready To Make Hollywood Debut - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/18/puri-jagnnadh.jpg.webp?itok=VS8FRCYT)
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్, యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో పూరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన సినిమాలకు యువత ఫిదా అవుతుంది. పూరీ సినిమా అంటే చాలు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. అలా డైరెక్టర్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆయన నట వారసుడిగా పూరీ తనయుడు ఆకాశ్ పూరి ఇప్పటికే టాలీవుడ్ తెరంగేట్రం చేశాడు. హీరో ఆకాశ్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన కూతురు పవిత్ర పూరీ కూడా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట.
చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు: ‘ప్రాజెక్ట్ కె’ టీం క్లారిటీ
అయితే హీరోయిన్‌గా మాత్రం కాదట. పూరీ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’లో పవిత్ర కూడా నిర్మాతగా ఉండనున్నట్టు సమాచారం. ఇక సినీ పరిశ్రమలో ఉన్న తక్కువమంది నిర్మాతల్లో పవిత్ర కూడా ఒకరు కాబోతున్నారని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే పూరీ కనెక్ట్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా మారారు పూరీ జగన్నాథ్. ఇప్పుడు మళ్లీ లైగర్‌తో డైరెక్టర్‌గా ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పూరీ.
Comments
Please login to add a commentAdd a comment