మరోసారి నాగ్- పూరీ కాంబో.. డిఫరెంట్ స్టోరీ రెడీ! | Puri Jagannadh Planning To Another Movie With Nagarjuna | Sakshi
Sakshi News home page

మరోసారి నాగ్- పూరీ కాంబో.. డిఫరెంట్ స్టోరీ రెడీ!

Published Sun, Jan 17 2021 8:27 PM | Last Updated on Sun, Jan 17 2021 8:44 PM

Puri Jagannadh Planning To Another Movie With Nagarjuna - Sakshi

కింగ్‌ నాగార్జున, డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘శివమణి’, ‘సూపర్‌’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. సూపర్‌ సినిమా కాస్త యావరేజ్‌గా నిలిచినా.. శివమణి మాత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేష‌న్ మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. పూరి దర్శకత్వంలో నాగ్‌ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

లాక్‌డౌన్‌ సమయంలో నాగార్జున కోసం పూరీ ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసాడట. సరికొత్త గెటప్‌లో నాగార్జునను చూపించబోతున్నాడట. ఫాంట‌సీ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా సాగుతుంద‌ని ప్రచారం జరుగుతుంది.  త్వరలోనే ‌ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ టాక్. గత  చిత్రాల మాదిరే ఈ సారి కూడా వీరిద్దరి కాంబినేషన్‌ విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి. ప్రస్తుతం పూరీ విజయ్‌ దేవరకొండతో ఓ మూవీ తీస్తున్నాడు. ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో అనన్యపండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి విజయ్ సినిమా తర్వాత పూరి ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement