ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, హీరో, సినీ దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే లారెన్స్.. ఇప్పటికే తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. ఇప్పుడు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని కేపీవై బాల అనే కమెడియన్ పలువురికి సాయం చేస్తూ కోలివుడ్‌లో సెన్సేషనల్‌గా మారాడు.
కోలీవుడ్‌లో ఒక కామెడీ షో ద్వారా కేపీవై బాల తెరపైకి వచ్చాడు. అక్కడ మంచి గుర్తింపు దక్కడంతో పలు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఆపై స్టాండ్ అప్ కమెడియన్‌గా కూడా ఆయన రాణిస్తున్నాడు. తను సంపాదనలో అధిక మొత్తాన్ని దాతృత్వ కార్యకలాపాలకే ఉపయోగించడం విశేషం. దానికి ప్రధాన కారణం తన అభిమాన హీరో లారెన్స్ అని ఆయన చెబుతుంటారు. లారెన్స్ ఆదర్శంగా ఆయన ఎందరికో సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. పలుమార్లు లారెన్స్, బాల ఇద్దరూ కలిసి సాయం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరూ కలిసి ఒక నిరుపేద మహిళకు సాయం చేశారు.
తమిళనాడులో మురుగమ్మాళ్ అనే మహిళకు బాల, లారెన్స్ సాయంగా నిలిచారు. పెళ్లయిన కొన్నేళ్లకే భర్తను కోల్పోయిన ఆమె తన ముగ్గురు కూతుళ్లను పోషించడమే కష్టం మారింది. ముగ్గురు కుమార్తెలను పోషించుకునేందుకు ఆ ప్రాంతంలో తిరిగే ట్రైన్స్‌లలో సమోసాలు విక్రయిస్తూ కాలం వెల్లదీస్తుంది. ఆమెకు ఆటో నడిపడం వచ్చినా.. ఆటో కొనేంత స్థోమత తనకు లేదు. దీంతో కొందరిని సాయం కోసం అడిగింది.. ఈ విషయం కాస్త బాల వద్దకు చేరడం.. ఆ వెంటనే రాఘవ లారెన్స్ వద్దకు ఆమె సమస్యను అతను తీసుకెళ్లడం జరిగిపోయాయి. లారెన్స్ ఇచ్చిన రూ. 3 లక్షల డబ్బుతో కొత్త ఆటోను బాల కొన్నాడు. ఇంకేముంది ఆమె కష్టాలకు ఫుల్‌స్టాప్ పడే సమయం వచ్చింది. ఆమె ఉన్న చోటుకు స్వయంగా లారెన్స్ వెళ్లారు. ఆపై కొత్తగా కొన్న ఆటోను ఆమెకు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆమె ఎమోషనల్ అయింది.
ఇక్కడ కమెడియన్ బాల కూడా పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాడు. గతేడాది మిగ్జామ్ తుపాను వచ్చినప్పుడు 200 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున బాలా అందించాడు. తాజాగా పెట్రోల్ బంకులో పనిచేసే ఓ యువకుడికి ద్విచక్ర వాహనం కొనిచ్చాడు. అంతేకాకుండా తన గ్రామానికి దగ్గర్లో ఉన్న పాఠశాలలో కొన్నేళ్లుగా సరైన టాయిలెట్స్ లేవుని తెలుసుకున్నాడు. ఇంకేముంది వెంటనే లారెన్స్ సాయంతో రూ. 15 లక్షలతో నిర్మించాడు. ఇలాంటివి లెక్కలేనన్ని సంఘటనలు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తాయి.
Service is god 🙏🏼🙏🏼 pic.twitter.com/LIeJA0Aej3
— Raghava Lawrence (@offl_Lawrence) March 29, 2024
Comments
Please login to add a commentAdd a comment