చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ గొప్ప మనసు చాటుకున్నారు. కోవిడ్-19పై పోరులో భాగంగా తమిళనాడు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసిన తలైవా, 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కాగా కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తమిళనాడులో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్, వ్యాక్సిన్ వంటి వైద్య సదుపాయాలను సమకూర్చడం కోసం, మరోవైపు ఉపాధి కోల్పోయిన ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో సీఎం స్టాలిన్ దాతలు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరారు.
ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రభుత్వానికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారు. హీరో సూర్య కుటుంబం కోటి రూపాయలు, సౌందర్యా రజినీకాంత్ ఫ్యామిలీ కోటి రూపాయలు అందజేశారు. అదే విధంగా, నటుడు శివకార్తికేయన్ రూ.25 లక్షలు, నిర్మాత, ఎడిటర్ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు మోహన్‌రాజ, నటుడు జయం రవి కలిసి రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు. వీరంతా సీఎం స్టాలిన్‌ను కలిసి తమ వంతు సాయం అందజేశారు. ఇక అన్నాత్తే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రజినీకాంత్ తమిళనాడు వెళ్లగానే ముఖ్యమంత్రిని కలిసి చెక్కు అందించారు.
చదవండి: కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: ముఖ్యమంత్రి పిలుపు
సౌందర్య రజనీకాంత్ రూ. కోటి విరాళం
Comments
Please login to add a commentAdd a comment