సూపర్‌స్టార్ రజనీకాంత్ 70 వసంతాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ సినిమాలతో ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. ఈయన పుట్టిరోజునాడు, పండుగలు ఉన్న సందర్భాల్లోనూ అభిమానులు ఈయన ఇంటి ముందు సందడి చేస్తుంటారు. రజనీకాంత్ ఇంటి బయటకు వచ్చి చెయ్యెత్తి అభివాదం చేసే వరకు అక్కడి నుంచి కదలరు. పొంగల్ సందర్భంగా సోమవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు చెన్నైలోని స్థానిక పోయెస్‌గార్డెన్‌లో రజనీకాంత్ ఇంటి ముంగిట వేకువ జామునే అభిమానులు బారులు తీరారు. దీంతో యథావిధిగానే రజనీకాంత్ వారికి కనిపించి అభివాదం చేయడంతో అభిమానుల్లో ఆనందం వెల్లి విరిసింది.
రజనీ అభిమానులపై అసహనం
అందరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్ అందరూ ఆరోగ్యంగా, మనశ్శాంతిగా, సంతోషంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. నిబద్ధత, నిజాయితీతో నడుచుకుంటే జీవితం ప్రశాంతంగా, సంతోషంగా సాగుతుందని ఆయన అభిమానులకు సూచించారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ పక్కింటి ఓ వృద్ధ మహిళ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అక్కడ సెక్యూరిటీ, అభిమానులతో వాగ్వాదానికి దిగారు. అభిమానులు తలైవా తలైవా అంటూ అరుస్తూ తమవంటి స్థానికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఏం మీ ఇంటి ద్వారాలు (రజనీకాంత్‌ను ఉద్దేశించి) తెరిచి వారిని లోనికి పిలిపించుకోవచ్చుగా అన్నారు.
పండగ పూట ఇబ్బంది..
అదేవిధంగా అభిమానులను ఉద్దేశించి వీరంతా తమ ఇంటి ముందు నిలబడి ఇలా కేకలు వేస్తున్నారని, తాము ఇంటిపన్ను కడుతున్నామని అయినా తమకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఉదయాన్నే అదీ పండుగ రోజున వచ్చి ఇలా ఇబ్బందికి గురిచేస్తున్నారని, దేవున్ని కూడా ప్రార్థించలేకపోతున్నామని ఆగ్రహించారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే రజనీకాంత్ నటించిన లాల్‌సలామ్ చిత్రంలోని రెండవ పాటను పొంగల్ సందర్భంగా విడుదల చేశారు. అదేవిధంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో రజనీకాంత్ అభిమానులు యమ ఖుషీ అవుతున్నారు.
ரஜினி வீட்டின் முன் குவிந்த ரசிகர்களிடம் வாக்குவாதம் செய்த பக்கத்து வீட்டுக்காரர் #Rajinikanth pic.twitter.com/MuslZRaqlC
— Ananth Vijay (@Ananth_Vijay01) January 15, 2024
చదవండి: డేంజర్ జోన్‌లోకి 'డేంజర్ పిల్ల' .. శ్రీలీల చేస్తున్న తప్పేంటి?
Comments
Please login to add a commentAdd a comment