ఒకే సినిమాలో ఇద్దరు లెజెండరీ హీరోలు.. మూడు దశాబ్దాల తర్వాత! | Thalaivar 170: Rajinikanth Working With Amitabh Bachchan After 33 Years - Sakshi
Sakshi News home page

Rajinikanth: సినీప్రియులకు అదిరిపోయే న్యూస్‌.. ఒకే సినిమాలో ఇద్దరు లెజెండరీ హీరోలు!

Published Wed, Oct 25 2023 1:42 PM | Last Updated on Wed, Oct 25 2023 3:15 PM

Rajinikanth Working with Amitabh Bachchan After 33 Years - Sakshi

జైలర్‌ సినిమా హిట్‌ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి.. వివిధ భాషల స్టార్స్‌ జైలర్‌లో కీలక పాత్రల్లో నటించారు. చూడటానికి రెండు కళ్లలు చాలవన్నట్లుగా అనిపించింది అభిమానులకు. అందుకే ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లోనూ బాగా ఆడింది. జైలర్‌ అనే కాదు మల్టీస్టారర్‌ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకే ఉంటుంది. 

ఇకపోతే ఇద్దరు లెజెండరీ నటుల కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుంది. అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో మూవీ రూపొందనుంది. తలైవా 170వ సినిమాలో బిగ్‌బీ నటించనున్నాడట.  ఈ విషయాన్ని రజనీకాంత్‌ స్వయంగా వెల్లడించాడు. 33 ఏళ్ల తర్వాత తన గురువు బిగ్‌బీతో కలిసి నటించబోతున్నట్లు పేర్కొన్నాడు. తనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

ఈ సినిమాకు జై భీమ్‌ ఫేమ్‌ టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్‌ తదితరులు నటించనున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించనున్నాడు. ఇకపోతే బిగ్‌బీ, తలైవా చివరగా 1991లో వచ్చిన హమ్‌ సినిమాలో కలిసి నటించారు.

చదవండి: రెండో భార్యకు నటుడు విడాకులు.. తొలిసారి స్పందించిన నటి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement