టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సరదాగా వంటగదిలోకి వెళ్లింది. నోరూరించే ప్యాన్‌కేక్స్ చేద్దామని స్టవ్ వెలిగించింది. తనకు తెలిసిన పద్ధతిలో వంటను రెడీ చేసింది. అప్పటికే రకుల్ వంటశాస్త్ర ప్రావీణ్యం గురించి తెలిసిన తమ్ముడు ఆ వంటను ఏం చేస్తుందో చూద్దామని వెయిట్ చేశాడు. అతడు ఊహించినట్లుగానే అవి ప్యాన్ కేక్స్ కాకుండా మరో కొత్త డిష్‌లా తయారవడం గమనార్హం. అయితే వాటి టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉందంటోంది రకుల్. కానీ ఆమె తమ్ముడు మాత్రం ఆ వంటను పెంట చేసినట్లు ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే రకుల్ ప్రస్తుతం హిందీలో బాగా బిజీగా మారింది. ఆయుష్మాన్ ఖురానా ‘డాక్టర్ జీ’, జాన్ అబ్రహాం ‘ఎటాక్’, అజయ్ దేవగన్ ‘మేడే’, ‘థ్యాంక్ గాడ్’ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూ బీ టౌన్‌లో ఫుల్‌ఫామ్‌లో ఉంది. వీటితో పాటు మరాఠీ దర్శకుడు తేజస్ దియోస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రంలో కండోమ్ టెస్టర్ పాత్ర చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment