
ప్రతిభకు అదృష్టం తోడైతే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. విజయానికి మూల సూత్రం ఇదే. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ మాత్రం నిరంతర ప్రయత్నం, కఠిన శ్రమతోనే తాను నటిగా ఉన్నతస్థాయికి చేరుకున్నట్లు చెప్తోంది. ఈ ఉత్తరాది భామ 2009లో గిల్లి అనే ద్విభాషా(కన్నడ, తెలుగు) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తరువాత తమిళం, తెలుగు భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా దక్షిణాదిలో చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.
ఈ బ్యూటీ తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించిన తాజా చిత్రం అయలాన్ ఈ నెల 12వ తేదీన తెరపైకి వచ్చింది. ఈ మూవీకి పాజిటివ్ స్పందన లభిస్తోంది, ఈమె నటించిన మరో చిత్రం ఇండియన్–2. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, ప్రియ భవాని శంకర్‌తో పాటు రకుల్ నటించిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
కాగా రకుల్ సినీ రంగప్రవేశం చేసి పదిహేనేళ్లు అయ్యింది. మొదటి ఐదేళ్లలో అంతగా గుర్తింపు, అవకాశాలు రాలేదు.. కానీ 2014 నుంచే తన సక్సెస్ మొదలైంది. అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రకుల్ అభిమాని ఒకరు పదేళ్ల సినీప్రయాణాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు. తన కఠిన శ్రమ, నిరంతర ప్రయత్నంతోనే ఈ స్థాయికి ఎదిగినట్లు
పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన రకుల్ హార్ట్ సింబల్‌తో సదరు అభిమానిపై ప్రేమ కురిపించింది.
❤️❤️❤️ https://t.co/1WINoqKkZb
— Rakul Singh (@Rakulpreet) January 10, 2024
చదవండి: ఆఫీసుల చుట్టూ తిరిగా.. అవమానించారు.. భరించలేక వెళ్లిపోదామనుకున్నా!
ఓటీటీల్లో ఈ ఒక్క వారంలోనే 45 సినిమాలా? అవి రెండు స్పెషల్!
Comments
Please login to add a commentAdd a comment