![Rakul Preet Singh Gives Clarity On Wedding Rumours With Jackky Bhagnani - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/9/rakul-preet-singh.jpg.webp?itok=Mfgxen-C)
‘‘నా జీవితానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయం అయినా నేనే అందరితో పంచుకుంటాను. అంతే కానీ అనవసరంగా అసత్యాలను ప్రచారం చేయకండి’’ అంటున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమ విషయాన్ని రెండు నెలల క్రితం రకుల్ బహిరంగంగానే తెలియజేశారు. అయితే తాజాగా వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్తలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఈ విషయంపై రకుల్ స్పందిస్తూ – ‘‘నా చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం నా దృష్టి అంతా వాటిపైనే ఉంది. అందుకే నా గురించి వచ్చే వదంతులను పట్టించుకునే తీరిక నాకు లేదు. ఇక నా జీవితం పట్ల నేనెంతో పారదర్శకంగా ఉంటాను. నాకు సంబంధించిన ఏ విషయం అయినా ఫస్ట్ నేనే చెబుతాను’’ అని పేర్కొన్నారు.
ఇక భగ్నానీలో తనకు నచ్చిన అంశాల గురించి రకుల్ మాట్లాడుతూ– ‘‘మా ఇద్దరి ఆలోచనాధోరణి ఒకేలా ఉంటుంది. సన్నిహితులకు, స్నేహితులకు మేం ఇచ్చే ప్రాధాన్యత కూడా ఒకేలా ఉంటుంది. అలాగే ఇద్దరం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఉదయాన్నే వర్కౌట్ చేయడం వంటి వాటిని కచ్చితంగా ఫాలో అవుతాం. మా ఇద్దరికీ మధ్య ఇన్ని కనెక్టింగ్ అంశాలు ఉన్నాయి కాబట్టే మేం కనెక్ట్ అయ్యామని అనుకుంటున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment