Ram Charan Shocking Pic Viral: New Look Leaked From RC15 Movie Shooting Set - Sakshi
Sakshi News home page

Ram Charan RC15 Pic: వైరల్‌ అవుతున్న రామ్‌ చరణ్‌ షాకింగ్‌ లుక్‌, పంచెకట్టుతో సైకిల్‌పై ఇలా

Published Tue, Apr 5 2022 1:51 PM | Last Updated on Tue, Apr 5 2022 4:10 PM

Ram Charan New Look Leaked From RC15 Movie Shooting Set - Sakshi

Ram Charan Shocking Look Goes Viral From RC15: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు సంబంధించిన ఓ షాకింగ్‌ లుక్‌ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చెర్రి పంచెకట్టులో కనిపించాడు. అంతేకాదు అచ్చం పల్లెటూరి వ్యక్తిలా పంచె కట్టుకుని సైకిల్‌పై కనిపించాడు. ఈ తాజా లుక్‌ చూసి చరణ్‌ ఇలా మారిపోయాడేంటి అని అంతా షాక్‌ అవుతున్నారు. అయితే ఈ లుక్‌.. చరణ్‌ తాజా సినిమా (RC15 మూవీ) సెట్‌ నుంచి లీకైనట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో RC15 తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్‌ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తాడని మొదటి నుంచి చెబుతున్నారు. 

చదవండి: ఈ కమర్షియల్‌ యాడ్‌కు చిరు పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

అయితే పంచెకట్టుతో ఉన్న ఈ తాజా లుక్‌ను చూసి అంతా ఆలోచనలో పడ్డారు. ఈ తాజా బజ్‌ ప్రకారం ఈ సినిమాలో చరణ్‌ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించానున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఈ లుక్‌ ఒకటని అంటున్నారు. కాగా శంకర్‌ సినిమా అంటే అందులో ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ తప్పసరిగా ఉండాల్సిందే. ఆయన దర్శకత్వంలో రూపొంది బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన భారతీయుడు, జెంటిల్‌మెన్‌ అపరిచితుడు వంటి చిత్రాల్లో కూడా ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ ఉన్నాయి. అవి ఆ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.

చదవండి: రష్మిక బర్త్‌డే: దుల్కర్‌ సల్మాన్‌తో జతకట్టిన రష్మిక, ఫస్ట్‌లుక్‌ అవుట్‌

అలాగే RC15లో కూడా 1930 సమయంలో ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉందని భోగట్టా. ఈ ఎపిసోడ్‌లో చరణ్‌ ఓ పోలిటికల్‌ లీడర్‌గా కనిపిస్తాడట. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ రీసెంట్‌ జరగగా.. ఇప్పుడు లీకైన ఈ ఫొటో సెట్స్‌లోనిదని తెలుస్తోంది. కాగా ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి టైమ్‌లో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement