
Ram Gopal Varma and Ashu Reddy Video: రామ్ గోపాల్ వర్మ... ఎప్పుడు ఏ పని చేస్తాడో? ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవరికీ తెలియదు. కేవలం సినిమా గురించే కాకుండా సమాజంలో జరిగే ప్రతి అంశంపై ఇతరులకు భిన్నంగా స్పందిస్తుంటాడు. నలుగురికి నచ్చనిది.. తనకు బాగా నచ్చిందని చెప్పే రకం ఆర్జీవీ. ముఖ్యంగా మహిళల గురించి ఆర్జీవీ చేసే కామెంట్స్ చాలా వైరల్ అవడంతో పాటు.. వివాదాస్పదం కూడా అవుతుంటాయి.
(చదవండి: ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ)
అయినప్పటికీ.. ఈ వివాదాస్పద దర్శకుడు ఇంటర్వ్యూ కోసం లేడీ యాంకర్స్ క్యూ కడుతుంటారు. దానికి కారణం.. ఆయనను ఇంటర్వ్యూ ప్రతి యాంకర్‌కి నెట్టింట ఫేమస్ అయిపోతుంటారు. దీనికి బిగ్‌బాస్ బ్యూటీ అరియానానే ఉదాహరణ. ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఆమెకు ఏకంగా బిగ్‌బాస్ రియాల్టీ షోకి వెళ్లే అవకాశం వచ్చింది.
(చదవండి: అధ్యక్ష భవనంలో తాలిబన్ల తీరుపై వర్మ షాకింగ్ కామెంట్)
తాజాగా మరో బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి కూడా వర్మను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లింది. ఇక తన ఇంటర్వ్యూ కోసం వచ్చిన లేడీ యాంకర్స్ పట్ల వర్మ ఎలా ప్రవర్తిస్తాడో అందరికి తెలిసిందే. తనదైన మాటలు, చేష్టలతో వారిని పొగిడేస్తుంటాడు. అషు రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ఆమె ముందు తన ఫోటోగ్రఫీ టాలెంట్‌ని చూపించాడు వర్మ. అషు రెడ్డి కుర్చీలో కూర్చొని ఉండగా.. వర్మ కింద కూర్చొని ఫోటో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ వీడియో ఇంకా బయటకు రాలేదు. ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment