Ram Gopal Varma Attends Bigg Boss Ashu Reddy Birthday Celebrations, Deets Inside - Sakshi
Sakshi News home page

Ashu Reddy Birthday Celebrations: అషురెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఆర్జీవీ రచ్చ..

Published Fri, Sep 16 2022 2:42 PM | Last Updated on Fri, Sep 16 2022 4:06 PM

Ram Gopal Varma Attends Bigg Boss Fame Ashu Reddy Birthday Celebrations - Sakshi

బిగ్‌బాస్‌ ఫేం అషురెడ్డి పుట్టిన రోజు వేడుకలో సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సందడి చేశాడు. గురువారం(సెప్టెంబర్‌ 15) బోల్డ్‌ బ్యూటీ అషురెడ్డి బర్త్‌డే. ఈ సందర్భంగా నిన్న రాత్రి ఆమె బర్త్‌డే సెలబ్రెషన్స్‌ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు టాలీవుడ్‌ నటీనటులతో పాటు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా హజరయ్యాడు. ఈ నేపథ్యంలో అషురెడ్డితో ఆర్జీవీ కేక్‌ కట్‌ చేయిస్తూ రచ్చ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్యయంగా అషు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి

ఈ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్స్‌ మెహబూబ్‌ దిల్‌సే, హరితేజ, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. కాగా ఆ మధ్య ఆర్జీవీని అషు ఓ ఇంటర్య్వూ చేసిన సంగతి తెలిసిందే. బోల్డ్‌గా సాగిన ఈ ఇంటర్య్వూలో నీ థైయ్స్‌ బాగున్నాయంటూ అషుపై ఆర్జీవీ చేసిన కామెంట్స్‌ ఆ మధ్య హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇదిలా కూతురు బర్త్‌డే సందర్భంగా ఆమె తండ్రి ఖరీదైన బెంచ్‌ కారు బహుమతిగా ఇచ్చాడు. మెర్సిడెజ్‌ బెంజ్‌ కంపెనికి చెందిన C200D మోడల్‌ కారును కూతురికి కానుగా ఇచ్చి ఆమె సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈ కారు ధర దాదాపు రూ. 70లక్షలు ఉంటుందని అంచనా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement