
సాక్షి, అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసేందుకు ఈ రోజు అమరావతికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రితో వర్మ భేటీ ముగిసింది. అనంతరం వర్మ మీడియాతో ముచ్చటించాడు.
చదవండి: పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, మీడియాతో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ మేరకు వర్మ మాట్లాడుతూ.. ‘మంత్రి పేర్ని నానితో సమావేశం సంతృప్తి నిచ్చింది. ఆయనతో మాట్లాడాక నేను కూడా 100 శాతం సంతృప్తి చెందాను. టికెట్ల విషయంలో నా ఆలోచనలను మంత్రికి వివరించా. ప్రభుత్వ ఆలోచనలను మంత్రి కూడా నాకు వివరించారు. నేను కేవలం నా ఆలోచనలను మాత్రమే చెప్పడానికి వచ్చాను. వీటిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment