‘ది కశ్మీర్ ఫైల్స్’.. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. రూ. 12 కోట్లు బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్ల వసూలు చేసి రూ. 200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీలో 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన ఆకృత్యాలను తెరపై చూపించారు. ఈ మూవీ ప్రధాని మోదీతో సహా పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
చదవండి: కారులో సీక్రెట్ ఫ్రెండ్‌తో స్టార్ హీరో కూతురు, ఫొటోలు వైరల్
ఇప్పటికే ఈ మూవీపై ప్రశంసలు కురిపించిన ఆర్జీవి తాజా మరోసారి కశ్మీర్ ఫైల్స్‌ను ఉద్దేశిస్తూ బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేస్తూ.. ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’బాలీవుడ్ చరిత్రను మార్చేసింది. బాలీవుడ్‌కు చెందిన 7 బడా ప్రొడక్షన్ హౌజ్‌లు టాప్‌లో ఉండటానికి పోటీపడుతూ ఉంటాయి. కానీ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు ఎప్పుడు ఎలా వచ్చి టాప్ చైర్‌లో కూర్చుంటాయో చెప్పలేం. ది కాశ్మీర్ ఫైల్స్ కిల్లర్ విజయం బాలీవుడ్‌లో ఉన్న అపోహలను చేరిపేసింది’అంటూ వర్మ రాసుకొచ్చారు. అంతేగాక ఆ అపోహలు ఏంటో కూడా వివరించాడు.
చదవండి: తల్లి కాబోతోన్న నయనతార?
Top 7 production houses of Bollywood will cease to be at the top and will lose their control on the film industry because #kashmirifiles proved that anyone from anywhere can come to sit on top which is ultimate democratisation of cinema . check link https://t.co/GdXBhXMYMy
— Ram Gopal Varma (@RGVzoomin) March 21, 2022
⇔ హిట్ సాధించాలంటే పెద్ద స్టార్లు కావాలి (కాశ్మీర్ ఫైల్స్‌లో స్టార్లు లేకపోవడమే కాదు, సినిమా డిసైడింగ్ స్టార్‌ను కూడా కలిగి లేదు)
⇔ హిట్ సాధించడానికి మీకు మెగా బడ్జెట్‌లు అవసరం ( కాశ్మీర్ ఫైల్స్ చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందింది)
⇔ హిట్ కావాలంటే మీకు సూపర్ హిట్ పాటలు కావాలి (కాశ్మీర్ ఫైల్స్ లో ఒక్క థీమ్ తప్ప మరేమీ లేదు)
⇔ హిట్ చేయడానికి మీకు మసాలా వినోదం అవసరం (కాశ్మీర్ ఫైల్స్‌లో మీరు ఒక్కసారి కూడా నవ్వలేరు)
⇔ హిట్ చేయడానికి మీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావాలి (మూవీకి ముందు నిర్మాత గురించి ఎవరు పెద్దగా విని ఉండరు)
⇔ మీరు హిట్ చేయడానికి అనేక కోట్ల ప్రమోషన్స్ కావాలి (రాధే శ్యామ్ 25 కోట్లతో పోలిస్తే కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు కేవలం 2.5 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు చేశారు)
⇔ ప్రేక్షకులు లాజిక్స్ లేని సినిమాలే చూస్తారని అనుకోవద్దు (ప్రేక్షకులు తీవ్రమైన సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారని కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత గ్రాంట్‌గా తీసుకున్నారు)
⇔ ఛార్ట్ బస్టర్ పాటలను చూపించాల్సి ఉంటుంది (కాశ్మీర్ ఫైల్స్‌లో ఎటువంటి ప్రయత్నం లేదు. హమ్ దేఖేంగే అనే బ్యాక్ గ్రౌండ్ థీమ్ మాత్రమే ఉంటుంది) ఇలా చాలా పాయింట్స్ ను ఆర్జీవీ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment