RGV Sister: Vijaya Lakshmi Interesting Comments On Ram Gopal Varma Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: అమ్మాయిల పిచ్చోడని అనుకుంటున్నారు, కానీ అసలు సంగతేంటంటే..

Published Wed, Mar 2 2022 1:12 PM | Last Updated on Wed, Mar 2 2022 1:57 PM

Ram Gopal Varma Sister Vijaya Lakshmi Intresting Comments On Brother - Sakshi

RGV Sister Vijaya Lakshmi First Interview: రామ్‌ గోపాల్‌ వర్మ.. అందరి కంటే భిన్నంగా ఆలోచిస్తూ.. తన రూటే సపరేట్ అంటాడు. నిత్యం సెలబ్రెటీలను సటైరికల్‌ కామెంట్స్‌తో కవ్విస్తుంటాడు. ఏ అంశాన్ని అయినా భిన్నమైన కోణంలో చూసి.. దానిని నిస్సందేహం వ్యక్తం చేస్తూ విమర్శలకు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తాడు. వర్మ అనగానే వివాదం, సంచలనం అనేంతగా మారాడు. సాధారణ మనిషిగా కనిపిస్తూనే అసాధారణమైన ధృక్పతంతో వ్యవహరించే ఆర్జీవీ.. చిన్నతనంలో ఎలా ఉండేవాడో అని ఎవరికి తొలిచినట్లుగా వాళ్లు ఊహించుకునే ఉంటారు. మరి అలాంటి వర్మ బాల్యంలో నుంచి ఎలా పెరిగాడు, ఆసలు ఆయన వ్యక్తిత్వం, ఆలోచనలు ఎలా ఉండేవో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది కదా.

చదవండి: విడాకుల తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్‌, ఐశ్వర్య.. ఏం జరిగిందంటే

అందుకే మీ అందరి కోసం వర్మ బాల్యం గురించి వివరించేందుకు తొలిసారి మీడియా ముందుకు వచ్చారు ఆయన సోదరి విజయలక్ష్మి. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో  విజయ లక్ష్మి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన మాటలు, తీరుతో అందరిని ఆశ్చర్యపరిచే వర్మ.. 9 ఏళ్ల వయసులో కుటుంబానికి షాకిచ్చాడట. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి అన్నయ్య(ఆర్జీవీ) భిన్నంగా ఆలోచించేవాడు. అసలు ఎవరికీ అర్థం అయ్యేవాడు కాదు. తొమ్మిదేళ్ల వయస్సులోనే తన మేధస్సుతో ఇంట్లో వాళ్లను ఆశ్చర్యపరిచాడు. ఓసారి మా మామయ్యతో నేను, అన్నయ్య సినిమాకు వెళ్లాం. తిరిగి వచ్చాక మామయ్యను తన సందేహం తీర్చమని అడిగాడు అన్నయ్య.

చదవండి: కరోనా పాజిటివ్‌.. చాలా నీరసించిపోయాను: శ్రుతి హాసన్‌

‘ఆ మూవీలో ట్రైన్‌ను బ్లాస్ట్ చేసేందుకు కొందరు రైలు పట్టాలపై టైం బాంబ్‌ను ఏర్పాటు చేశారు. కొంత టైం సెట్ చేసి.. ఆ రైలు అక్కడకు రాగానే పేలిపోయేలా ప్లాన్ చేశారు.’ ఇదే విషయాన్ని అన్నయ్య మామయ్యను అడిగాడు. అసలు మన దేశంలో ట్రైన్ ఎప్పుడైనా సరైన టైంకి వస్తుందా? అలాంటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ టైమ్ బాంబును సెట్ చేయడం ఏంటీ? అని ప్రశ్నించాడు. దీనికి నిజమే కదా అని అనుకున్నారు. అలా అప్పటి నుంచే అన్నయ్య ప్రతి విషయాన్ని ప్రశ్నించడం, లాజికల్‌గా థింక్ చేయడం ప్రారంభించారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఆర్జీవి అమ్మాయిల పిచ్చోడు అనే అంశంపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి విజయ లక్ష్మి స్పందిస్తూ.. అందరూ అనుకున్నట్లు ఆయనకు అసలు అమ్మాయిల పిచ్చి లేదు అని చెప్పారు.

చదవండి: హీరోగా ‘మైనింగ్‌ కింగ్‌’ గాలి జనార్థన్‌ రెడ్డి కుమారుడు, మూవీ టైటిల్‌ ఖరారు

‘చిన్నప్పుడు మా ఇంటికి నా స్నేహితురాలు అనురాధ వచ్చింది. వచ్చిన వెంటనే ఆమెతో నీ కళ్లు చాలా బావున్నాయి అని చెప్పేశాడు. అది విని నేను షాక్ అయ్యా. ఆ తరవాత చాలాసార్లు నా స్నేహితురాలు మీ అన్న నన్ను పొగిడాడు అని చెప్పుకునేది. అయితే నేను వర్మతో.. దానికి మెల్లకన్ను, నీకు ఎలా నచ్చింది అని అడిగా.. దానికి అన్నయ్య ‘అస్సలు నేను ఆ అమ్మాయిని కూడా చూడలేదు.. ఏదో ఒక మాట అలా అనేశాను’ అని చెప్పాడు. మరోసారి బ్యాంకులో ఇంకో అమ్మాయి నవ్వు బాగుందని ఆమెతోనే చెప్పాడు.. అలా అన్నయ్య అమ్మాయిలను సంతోషపెట్టే మాటలే తప్ప ఏరోజు వారితో మిస్ బిహేవ్ చేసింది లేదు. అలాగే ఈ మధ్య అమ్మాయిలతో డ్యాన్స్‌లు వేయడం కూడా అలాంటిదే’ అని అసలు విషయం వివరించారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement