
రామ్ హీరోగా నటించిన చిత్రం ‘రెడ్’. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ కథానాయికలు. తిరుమల కిశోర్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో అనువదించాం. కన్నడం, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, తమిళం, హిందీలో డబ్ చేశాం. కన్నడ వెర్షన్ ఈ నెల 14నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్‌లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాం. తమిళ వెర్షన్‌ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నాం. తెలుగు వెర్షన్‌ని గ్రేట్ ఇండియా ఫిలింస్ ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్‌లలో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది’’ అన్నారు చిత్రసమర్పకులు కృష్ణ పోతినేని.
Comments
Please login to add a commentAdd a comment