Ram Pothineni, Sreeleela Shoot For Boyapati Movie in Mysore, Selfie Pic Goes Viral - Sakshi
Sakshi News home page

మైసూర్ లో డ్యూయెట్ పాడుకుంటున్న రామ్ - శ్రీలీల, సెల్ఫీ పిక్ వైరల్‌

Published Wed, Jun 7 2023 8:01 AM | Last Updated on Wed, Jun 7 2023 9:50 AM

Ram Pothineni, Sreeleela Shoot For Boyapati Movie in Mysore, Selfie Pic Viral - Sakshi

ఒక పాట, ఒక పవర్‌ఫుల్‌ ఫైట్‌ కోసం రామ్, శ్రీలీల, బోయపాటి అండ్‌ టీమ్‌ మైసూర్‌ వెళ్లారు. ఈ సందర్భంగా మైసూర్‌లో రామ్, శ్రీలీల సెల్ఫీలు దిగి, సందడి చేశారు. రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించిన ఒక యాక్షన్‌ సీక్వెన్స్, ఒక పాటను మైసూర్‌లో చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు. మంగళవారం ఆరంభమైన ఈ షెడ్యూల్‌ ఈ నెల 15 వరకు సాగుతుంది. ఈ షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా సినిమా పూర్తవుతుంది. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న  ఈ చిత్రం అక్టోబర్‌ 20న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement