రానా అంటేనే ప్రయోగాలు. లీడర్తో కెరీర్ బిగిన్ చేసినప్పటి నుంచి ఈ దగ్గుబాటి హీరో కొత్తదారిలో వెళ్లే ప్రయత్నమే చేసాడు. అతని సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. క్యారెక్టర్స్ ఇంకాస్త కొత్తగా కనిపిస్తాయి. ప్రతిసారి కొత్త కథను చెప్పేందుకు ట్రై చేస్తూ వచ్చాడు. అందుకు కారణం తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లేదని రానా ఫిక్స్ కావడమే.
కానీ విరాటపర్వం చేస్తున్న సమయంలో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అర్ధమైంది. అభిమానులు ఏం కోరుకుంటున్నారో అర్ధమైంది. అందుకే ఫ్యాన్స్ కోసం ఇకపై ప్రయోగాలు చేయను, విరాటపర్వం మాత్రమే లాస్ట్ అంటూ అని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట ఇచ్చాడు. ఇకపై కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తానంటున్నాడు.
(చదవండి: కమల్ సర్ నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు: అనిరుధ్)
ఇప్పటి వరకు రానా చేసిన జర్నీలో ఎన్నో వైవిథ్యమైన పాత్రలు చేశాడు.బాహుబలిలో భల్లాలదేవ, రుద్రమదేవిలో చాలుక్య వీరభద్ర, నేనే రాజు నేనే మంత్రిలో జోగేంద్ర, భీమ్లా నాయక్ లో డేనియల్ శేఖర్ రోల్స్ రానాకు చాలా మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఇకపై కంప్లీట్ గా హీరోగా మారి తాను కూడా మూవీస్ ఫర్ ఫ్యాన్స్ ట్రెండ్ ఫాలో అవుతానంటున్నాడు. మరి ఏ జానర్ చిత్రాలతో రానా అలరిస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment