Is Randeep Hooda Dating Mary Kom Actress Lin Laishram?, Deets Inside - Sakshi
Sakshi News home page

Randeep Hooda: మళ్లీ ప్రేమలో పడ్డ హీరో, సహజీవనం కూడా?!

Published Sun, Mar 20 2022 5:22 PM | Last Updated on Sun, Mar 20 2022 5:53 PM

Is Randeep Hooda Dating With Model Lin Laishram? Details Inside - Sakshi

బాలీవుడ్‌ హీరో రణ్‌దీప్‌ హుడా ప్రేమలో పడ్డాడట! నటి లిన్‌ లైశ్రమ్‌ మీద అతడు మనసు పారేసుకున్నాడంటూ బీటౌన్‌లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొన్నేళ్లుగా ఫ్రెండ్‌షిప్‌ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట గత కొంతకాలంగా అత్యంత సన్నిహితంగా మెదులుతున్నారని టాక్‌. అంతేకాదు, వీళ్లు సహజీవనం కూడా చేస్తున్నారంటూ కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. కాగా లిన్‌ లైశ్రమ్‌ నటి మాత్రమే కాదు సక్సెస్‌ఫుల్‌ మోడల్‌ కూడా! ఆమె 'ఓం శాంతి ఓం', 'రంగూన్‌', 'మేరీ కోమ్‌' సహా పలు చిత్రాల్లో నటించింది.

కాగా రణ్‌దీప్‌ హుడా గతంలో నీతూ చంద్రాను ప్రేమించాడు. సుమారు మూడేళ్లపాటు(2010-2013) ప్రేమలో మునిగి తేలిన వీళ్లిద్దరూ తర్వాత బ్రేకప్‌ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఈ హీరో మరోసారి ప్రేమలో పడటం చర్చనీయాంశంగా మారింది. హుడా హైవే, కిక్‌, జన్నత్‌ 2, జిసమ్‌ 2 తదితర చిత్రాలతో అతడు పాపులారిటీ సంపాదించుకున్నాడు.

చదవండి: ముస్కాన్‌.. ఆకర్షించే అందం, ఆలపించగల స్వరం ఆమె సొంతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement