Anchor Rashmi Gautam Fires On Negative Comments Over Naga Shourya Video - Sakshi
Sakshi News home page

Rashmi Gautam: వాడి లవర్‌ వాడిష్టం.. అమ్మాయేం తప్పు చేసిందో.. మండిపడ్డ రష్మీ

Published Wed, Mar 1 2023 2:13 PM | Last Updated on Wed, Mar 1 2023 3:04 PM

Rashmi Gautam Fires On Negative Comments over Naga Shourya Video - Sakshi

నడిరోడ్డుపై ప్రేయసి చెంప చెల్లుమనిపించిన యువకుడితో హీరో నాగశౌర్య వాదనకు దిగిన విషయం తెలిసిందే! అమ్మాయి మీద చేయి చేసుకోవడం తప్పని, ఇందుకుగానూ సారీ చెప్పి తీరాల్సిందేనని వాదించగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరేమో రియల్‌ హీరో అని మెచ్చుకుంటుంటే మరికొందరేమో ప్రేమికుల మధ్యలో దూరడం అవసరమా? అని విమర్శిస్తున్నారు.

'లవర్స్‌ మధ్య వంద సమస్యలు ఉంటాయి. నువ్వు మధ్యలో కల్పించుకోవడం అవసరమా? వాడి గర్ల్‌ఫ్రెండ్‌ వాడిష్టం. ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్‌ లేనప్పుడు ఈ అతిగాడికి ఏం సమస్యో..', 'ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందో ఎవడికి తెలుసు? అయినా వాడి లవర్‌ను వాడు కొట్టుకుంటుంటే నీకేంటి?' అంటూ కామెంట్లు చేశారు. వీటి స్క్రీన్‌షాట్లను యాంకర్‌ రష్మీ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ సదరు నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'వాడి లవర్‌ వాడి ఇష్టం.. అమ్మాయినే సపోర్ట్‌ చేస్తున్నారంటూ కామెంట్లు చేయడం ఎంత సిగ్గుచేటు. తను ఎంత ఒత్తిడికి లోనవుతుందో ఎవరికి తెలుసు? మరో ఆత్మహత్య జరగాలని ఎదురుచూస్తున్నారా?' అని ఫైర్‌ అయింది. కాగా ఇటీవల జరిగిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును గుర్తు చేస్తూ రష్మీ ఈ కామెంట్‌ చేసినట్లు తెలుస్తోంది.

చదవండి: ఆస్కార్‌ లైవ్‌లో నాటు నాటు పాట.. మోత మోగించనున్న రాహుల్‌, కాలభైరవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement