దక్షిణాది, ఉత్తరాది అనే బేధం లేకుండా అన్నిచోట్లా రఫ్ఫాడిస్తోంది హీరోయిన్ రష్మిక మందన్నా. కన్నడంలో కిరిక్ పార్టీ చిత్రంలో నటించి తెలుగు దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డ ఈ అమ్మడు తర్వాత.. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. అయితే పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్న సామెత చందంగా ఈమె పలు విమర్శలు ఎదుర్కొంది. అలాగే కొన్ని అపజయాలను ఎదుర్కొంది.
ముఖ్యంగా కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం సుల్తాన్ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ తరువాత విజయ్‌తో రొమాన్స్ చేసిన వారిసు చిత్రంలోనూ ఆ పాత్ర గ్లామర్‌కే పరిమితమైంది. అయినప్పటికీ బాలీవుడ్ నుంచి రష్మికకు కాల్ వచ్చింది. అక్కడ నటించిన రెండు చిత్రాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. అయితే లక్కు ఉంటే ఏ అపజయం ఆపలేదు అన్నట్లుగా రష్మిక బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను అందుకుంటోంది. ఇక టాలీవుడ్‌లో పుష్ప–2 చిత్రంతో పాటు రెయిన్‌బో అనే ద్విభాషా ( తెలుగు, తమిళం) చిత్రంలో నటిస్తోంది.
ఇటీవల ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పుడు తన టైమ్ బాగుందని పేర్కొంది. ప్రతి బియ్యపు గింజపైనా మన పేరు రాసి ఉంటుందని అంటారని, ఇది నటీనటులకూ వర్తిస్తుందని తాను అంటానంది. నటించే పాత్రలపైనా వారి పేరు రాసి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికీ మంచి టైమ్ వస్తుందని, అలా తనకిప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయని చెప్పింది. అంతగా చిత్రాల్లో బిజీగా నటిస్తున్నట్లు పేర్కొంది. అన్నింటికీ మించి మంచి కథా పాత్రలు వరిస్తుండడం సంతోషంగా ఉందని చెప్పింది. ఈమె నటించిన హింది చిత్రం యానిమల్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
చదవండి: 'కోహ్లీ ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడుంటే సిక్స్ పోయేదంట'.. వైరలవుతోన్న వీడియో!
Comments
Please login to add a commentAdd a comment