రావణలంక ఫేమ్‌ క్రిష్‌ లవ్వాట | Ravana Lanka Fame Krish New Movie Lavvata Title Logo Released | Sakshi
Sakshi News home page

Ravana Lanka Fame Krish: రావణలంక ఫేమ్‌ క్రిష్‌ లవ్వాట

May 24 2022 12:05 PM | Updated on May 24 2022 12:05 PM

Ravana Lanka Fame Krish New Movie Lavvata Title Logo Released - Sakshi

‘నా తొలి, మలి  సినిమాలు ‘ప్రేమభిక్ష, రుద్రాక్షపురం’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటున్నాయి. మూడో చిత్రం ‘లవ్వాట’ టైటిల్‌ లాంచ్‌ జరుపుకోవడం ఆనందంగా ఉంది

‘రావణలంక’ ఫేమ్‌ క్రిష్‌ బండిపల్లి హీరోగా, మీరా కన్నన్, దీక్ష హీరోయిన్లుగా నటించనున్న  చిత్రం ‘లవ్వాట’. ఆర్‌.కె. గాంధీ దర్శకుడు. నిడిగంటి సాయి రాజేష్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌. వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు, వెంకటగిరి శ్రీనివాస్‌ నిర్మించనున్నారు. టైటిల్‌ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన మానే రామారావు ‘లవ్వాట’ టైటిల్‌ లోగోని విడుదల చేశారు.

ఆర్‌.కె. గాంధీ మాట్లాడుతూ– ‘‘నా తొలి, మలి  సినిమాలు ‘ప్రేమభిక్ష, రుద్రాక్షపురం’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటున్నాయి. మూడో చిత్రం ‘లవ్వాట’ టైటిల్‌ లాంచ్‌ జరుపుకోవడం ఆనందంగా ఉంది. ప్రేమ పట్ల నేటి తరం ధృక్పథం ఎలా ఉందో వినోదాత్మకంగా ‘లవ్వాట’లో చెప్పనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందిస్తాం’’ అన్నారు. ‘‘జూన్‌ 22 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్‌. నాగేంద్ర, సంగీతం: జీకే.

చదవండి: సీక్రెట్‌ స్మోకింగ్‌పై స్పందించిన బిందుమాధవి

కుంభకర్ణుడిలా పడుకుంది చాలు, ముందు అప్‌డేట్‌ ఇవ్వు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement