Khiladi Movie Teaser Release Date | Ravi Teja Upcoming Movie With New Director - Sakshi
Sakshi News home page

కొత్త డైరెక్టర్‌తో?

Apr 10 2021 6:31 AM | Updated on Apr 10 2021 1:41 PM

Ravi Teja to launch another new director - Sakshi

కథ నచ్చాలే కానీ కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో హీరో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే పలువురు నూతన దర్శకులకు అవకాశం ఇచ్చిన ఆయన తాజాగా మరోసారి కొత్త డైరెక్టర్‌తో పనిచేసేందుకు పచ్చజెండా ఊపారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇటీవల ఒక నూతన దర్శకుడు రవితేజను కలిసి కథను వినిపించాడట. అతను కథ చెప్పిన విధానంతో పాటు తన ప్రతిభపై నమ్మకం కలగడంతో రవితేజ ఓకే
చెప్పారనే మాటలు వినిపిస్తున్నాయి. ‘విరాటపర్వం’ సినిమాను నిర్మిస్తున్న సుధాకర్‌ చెరుకూరి దీన్ని కూడా నిర్మించనున్నారట.

త్వరలోనే ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలు పెట్టనున్నారని టాక్‌. కాగా ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్‌ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. జయంతీలాల్‌ గడ సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ‘ఖిలాడి’ చిత్రం టీజర్‌ని ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రవితేజ. డైరెక్టర్‌ మారుతితోనూ మరో చిత్రానికి  చర్చలు జరిగాయనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement