‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం కావడంతో ‘క్రాక్’. చాలా రోజుల తర్వాత థియేటర్లలో తమ అభిమాన హీరో సినిమా చుద్దామనుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్‌కు శనివారం నిరాశ ఎదురైంది. కరోనాని సైతం లెక్కచేయకుండా ఉదయమే థియేటర్లకు వచ్చిన ఫ్యాన్స్ దారుణంగా మోసపోయారు. తమ అభిమాన హీరోని ఈ రోజు బిగ్‌స్రీన్‌పై చూడలేమనే వార్త విని నిరాశలో మునిగిపోయారు. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌లను షాకయ్యారు. ఇక మార్నింగ్ షో పోతే పోనిలే.. మాట్నీస్ నుంచి అయినా ఎంజాయ్ చేద్దామకున్న అభిమానులకు.. ఆ అవకాశం కూడా దక్కలేదు. ‘క్రాక్’ సినిమా ఈ రోజు విడుదల కాదంటూ చావు కబురును చల్లగా అందించారు చిత్రబృందం. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా నిరాశలో మునిగిపోయారు.
ఈ ఏడాది విడుదల అవుతున్న తొలి భారీ సినిమా కావడంతో క్రాక్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కరోనా కాలంగా ఇన్నాళ్ల థియేటర్లకు దూరంగా ఉన్న సినీ అభిమానులు సైతం.. మాస్ మహారాజా సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూశారు. దాదాపు 1000 థియేటర్లలో క్రాక్ బొమ్మ కనిపించింది. పైగా ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు పాజిటివ్ టాక్ రావుడంతో రవితేజ ఫ్యాన్స్ పుల్ హ్యాపీతో థియేటర్లకు వెళ్లారు. ఇక తమ హీరో సినిమాకి పోటీగా ఇప్పట్లో ఏ సినిమాలు లేవని, కలెక్షన్ల వర్షం కురవడం ఖాయామని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అలాంటి సమయంలో అనుకోకుండా సినిమా వాయిదా పడటంతో అభిమానులు మాత్రమే కాదు.. రవితేజ కూడా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది. నిర్మాత ఠాగూర్ మధు తీరు పట్ల రవితేజ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముందే ఇవన్నీ చూసుకోకపోతే ఎలా అంటూ సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. చిన్న పొరపాటు వల్ల భారీ నష్టాలు వస్తాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. వీలైనంత త్వరగా ఆర్థిక ఇబ్బందులను తొలగించి సినిమా విడుదలయ్యేలా చూడాలని నిర్మాతలకు రవితేజ గట్టిగానే సూచించినట్లు తెలుస్తుంది. నిర్మాత మధు డిస్టిబ్యూటర్లతో ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్లు పూర్తవకపోవడం వల్లే సినిమా వాయిదా పడినట్లు సమాచారం. అలాగే మధు గతంలో నిర్మించిన చిత్రాలకు సంబందించి డిస్టిబ్యూటర్లతో ఒప్పందం చేసుకున్న డబ్బును అందించలేదని, అందుకే వారంతా కోర్టుకు వెళ్లి సినిమా వాయిదా వేయించారని తెలుస్తోంది. ఏదేమైనా.. నిర్మాత తప్పిదానికి రవితేజ బలి అవుతున్నారని మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయిదా ఎఫెక్ట్.. కలెక్షన్ల మీద పడుతుందని భయపడుతున్నారు. ఈ ఆలస్యం ‘క్రాక్’ కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో త్వరలోనే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment