
Bigg Boss 15: టీవీ షోస్ బిగ్‌బాస్ షోకి ఉన్న పాపులారిటీ తెలిసిందే. అలాంటి షో పార్టిసీపేట్ చేసే అవకాశం వచ్చిందంటే ఎవరైన ఎగిరిగంతేస్తారు. అయితే ఇటీవల బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బిగ్‌బాస్ 15 పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరిగింది. దానికి షో యాజమాన్యం వారానికి దాదాపు 35 లక్షల ఆఫర్ చేసిన వార్తలు హల్‌చల్ చేశాయి. వాటి గురించి నటి తాజాగా సోషల్ మీడియా క్లారిటీ ఇచ్చింది.
‘నేను బిగ్ బాస్ టీవీ షోలో పాల్గొంటున్నట్లు పుకార్లు వస్తున్నాయని విన్నాను. ఆ రూమర్స్‌లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఇది పెడుతున్నా. బిగ్‌బాస్‌లో నేను పార్టిసీపేట్ చేయట్లేదు’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రియా తెలిపింది. దీంతో ఒక్కసారిగా ప్రచారాలన్ని పటాపంచలైపోయినట్లైంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం వెబ్ షోలు, సినిమాలు చేస్తూ బాలీవుడ్ కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment