నాపై భయంకరమైన వార్తలు రాస్తున్నారు: రియా | Rhea Chakraborty Horrible Things Said About Me | Sakshi
Sakshi News home page

సంచలన ఆరోపణల నేపథ్యంలో రియా స్పందన

Published Fri, Jul 31 2020 7:35 PM | Last Updated on Fri, Jul 31 2020 7:37 PM

Rhea Chakraborty Horrible Things Said About Me - Sakshi

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో గత వారం రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు సుశాంత్ డిప్రెషన్‌, బంధుప్రీతి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావించారు. కానీ తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ బిహార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అనూహ్యంగా సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. ఆమె వల్లనే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కేకే సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. రియా, ఆమె కుటుంబ సభ్యులు డబ్బు కోసం సుశాంత్‌ను వేధించారని కేకే సింగ్‌ ఆరోపించారు. రియా తన కొడుకు డబ్బులు, నగలు తీసుకుని పారిపోయిందన్నారు. మరోవైపు సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రియా తనను వేధిస్తోందని సుశాంత్‌ తనతో చెప్పాడన్నది అంకిత. ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (సహ జీవనం.. జూన్‌ 8 వరకు తనతోనే: రియా)

ఈ పరిస్థితుల నేపథ్యంలో రియా చక్రవర్తి తొలిసారి మీడియా ముందుకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఈ మేరకు రియా టీం ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. దీనిలో రియా.. దేవుడిపై అలాగే న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని.. తనకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియాలో తన గురించి చాలా భయంకరమైన విషయాలు చెబుతున్నప్పటికీ.. తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను అన్నారు. వీటిపై తన లాయర్స్ సలహా మేరకే స్పందిస్తానన్నారు రియా. చివర్లో సత్యమేవ జయతే.. నిజం గెలుస్తుంది అంటూ వీడియోను ముగించారు రియా. వీడియోలో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement