ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. వీడని చిక్కుముడిలా తయారైన ఈ కేసులో ఒక్కో ముడి మెల్లగా విడిపోతున్నట్లు కన్పిస్తోంది. జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ మరణించే ఆరు రోజుల ముందు రియా చక్రవర్తి అతని ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో సుశాంత్ ఇంటిని విడిచి పెట్టడానికి గల కారణాల గురించి రియా నోరు విప్పారు. సుశాంత్ తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోరినప్పటికీ ఆ తర్వాత రోజు చివరి మెసేజ్ చేశాడని ఆమె వెల్లడించారు. అయితే ఆ తర్వాత కోపంలో సుశాంత్ ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు తెలిపారు. (అందుకే సుశాంత్ అంత్యక్రియలకు వెళ్లలేదు: రియా)
ఆమె మాట్లాడుతూ.. ‘కొన్ని రోజుల నుంచి నన్నుమా ఇంటికి వెళ్లామని సుశాంత్ కోరాడు. అప్పుడు నేను ఆందోళనలో ఉన్నానని ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఉండమని సూచించాడు. కానీ నాకు జూన్ 8న ఉదయం 11.30 గంటకు ధెరపీ సెషన్ బుక్ చేసుకున్నాను. అంటే దీనిని బట్టి నాకు సుశాంత్ ఇంటిని విడిచి పెట్టే ఉద్ధేశ్యం లేదని అర్థం చేసుకోవచ్చు. నా తల్లిదండ్రులు నన్ను ఆ స్థితిలో చూడాలని నేను కోరుకోనందున నా ఇంట్లో ఆ చికిత్స చేసుకోలేను. కాబట్టి నా థెరపీ సెషన్ అయిపోయాక ఇంటికి వెళ్తాను అని చెప్పాను. కానీ సుశాంత్ తన సోదరి మీతు సింగ్ వస్తున్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి వెళ్లాలని అడిగాడు. అతను తన తండ్రీ, సోదరితో మాట్లాడుతున్నాడు. తన కూర్గ్ వెళ్లే విషయం కూడా వారికి చెప్పాడు. నేను కేవలం ఒక షరతుతో మాత్రమే ఇంటి నుంచి వెళ్తానని చెప్పాను. సుశాంత్ సోదరి తనతో ఉంటేనే వెళ్తానని చెప్పాను. కానీ అందుకు అతడు ఒప్పుకోలేదు. ఆమె రెండు గంటల్లో వస్తోందని తను రాకముందే నన్ను వెళ్లాలని కోరాడు’. అని పేర్కొన్నారు. (సుశాంత్ విచిత్రంగా ప్రవర్తించేవాడు..)
అయితే సుశాంత్ ఇంటి నుంచి తను వెళ్లిపోయాక జూన్ 9న మళ్లీ అతను ఆమెకు మెసేజ్ చేసినట్లు రియా తెలిపారు. తనకు ఆరోగ్యం బాలేదని సుశాంత్‌కు తెలుసని అందుకే ‘నువ్వు ఎలా ఉన్నావ్’ అంటూ మెసెజ్ చేసినట్లు వెల్లడించారు. ‘నేను 8 వ తేదీన ఇంటికి వచ్చాను. ఆ రోజంతా తను కాల్ చేయలేదని ఎంతో బాధపడ్డాను. కానీ నా ఆరోగ్యం బాలేదని తెలిసినప్పటికీ తను నాకు కేవలం మెసేజ్ చేశాడు. దీంతో సుశాంత్ నన్ను ఇక కోరుకోవడం లేదని నేను జూన్ 9న అతన్ని బ్లాక్ చేశాను. సుశాంత్, వాళ్ల సోదరీల మధ్య గొడవ పెట్టాలని అనుకోలేదు’ అన్నారు. (రియాను దారుణంగా వేధిస్తున్నారు..)
కాగా ఇటీవల జరిగిన గొడవల గురించి తన తల్లిదండ్రులకు తెలియదని రియా అన్నారు. అయినప్పటికీ, సుశాంత్ రియా ఫ్యామిలీ గ్రూప్‌లో ఉంటూ తన సోదరుడితో సన్నిహితంగా ఉండేవాడని పేర్కొంది. సుశాంత్ జూన్ 10న నా సోదరుడికి మెసేజ్ చేశారు. ‘ భాయ్, రియా ఎలా ఉంది, తను ఎప్పుడు మంచిగా ఉంటుందో నాకు చెప్పండి. అని అడిగాడు. కానీ సుశాంత్ ఎప్పుడూ రియా నువ్వు కావాలి. తిరిగి వచ్చేయ్ అని అడగలేదు. అతను అలా చెప్పి ఉంటే అన్ని వదులుకొని తన వద్దకు వెళ్లేదాన్ని. కానీ సుశాంత్ నన్ను కోరుకోవడం లేదని తెలిసి షాక్‌కు గురయ్యాను’. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. (డ్రగ్ డీలర్‌తో రియా చాట్.. అరెస్ట్!)
Comments
Please login to add a commentAdd a comment